పెళ్లైన వ్యక్తితో ప్రేమ.. తల్లిదండ్రులు తిరస్కరించడంతో | Man And Woman Deceased In Karnataka Over Love Affair | Sakshi
Sakshi News home page

పెళ్లైన వ్యక్తితో ప్రేమ.. తల్లిదండ్రులు తిరస్కరించడంతో

Aug 18 2021 7:14 AM | Updated on Aug 18 2021 7:15 AM

Man And Woman Deceased In Karnataka Over Love Affair - Sakshi

పుష్పలత, తిప్పేస్వామి (ఫైల్‌)  

యశవంతపుర: వివాహిత వ్యక్తితో యువతి ప్రేమాయణం ఇద్దరినీ బలిగొంది. ఈ దుర్ఘటన చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా కోనికెరె గ్రామంలో జరిగింది. చెళ్లకెరె తాలూకా పరశురామపుర గ్రామానికి చెందిన తిప్పేస్వామి (32), హిరియూరు తాలూకా ఉడువళ్లివాసి పుష్పలత (21) ప్రేమికులు. తిప్పేస్వామికి ఇప్పటికే పెళ్లయి పిల్లలున్నారు.

మూడేళ్ల నుంచి తిప్పేస్వామి ఆమెకు ప్రేమపేరుతో దగ్గరయ్యాడు. అతనితో వివాహం చేయాలని పుష్పలతా తల్లిదండ్రుల వద్ద పట్టుబట్టింది. తల్లిదండ్రులు తిరస్కరించడంతో మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. కోనికెరె వద్ద ప్రేయసీ ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. హిరియూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement