అన్నదమ్ములిద్దరూ ఇద్దరే!...వాంటెడ్‌ క్రిమినల్స్‌ | Man And His Brother Wanted Criminals In Separated Cases | Sakshi
Sakshi News home page

అన్నదమ్ములిద్దరూ ఇద్దరే!...ఒకరు కిడ్నాప్‌, మరోకరు అఘాయిత్యాలు

Published Wed, Oct 26 2022 5:02 PM | Last Updated on Wed, Oct 26 2022 5:33 PM

Man And His Brother Wanted Criminals In Separated Cases  - Sakshi

ఎక్కడైన అన్నదమ్ములు అనగానే ఒకరు ఒకలా మరోకరు డిఫరెంట్‌గా ఉంటారు. ఇది సర్వసాధారణం. మరికొన్ని చోట్ల ఒ‍కరుకొకరు ఆదర్శవంతంగా ఐక్యమత్యంగా ఉంటారు. ఇక్కడ మాత్రం పూర్తి విరుద్ధం ఈ  అన్నదమ్ములిద్దరూ. పైగా ఒకరుకి మించి మరొకొకరు వాంటెడ్‌ క్రిమినల్స్‌

వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్‌లో నివశిస్తున్న27 ఏళ్ల వ్యక్తి అతని సోదరుడు ఇద్దరు వేర్వేరు కేసుల్లో వాంటెడ్‌ క్రిమనల్స్‌.  27 ఏళ్ల ఆశిష్‌ చౌహన్‌  ఆగస్టు 29, 2017న తన సహచరులతో కలసి ఒక వ్యక్తి కిడ్నాప్‌ చేసి దాదాపు రూ. 3 కోట్లు డిమాండ్‌ చేశాడు. సమాచారం అందుకున్న అప్పటి పోలీసులు ఆశిష్‌ని ట్రేస్‌ చేసి పట్టుకుంటున్న సమయంలో బహిరంగంగా పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు.

దీంతో పోలీసులు ఎన్‌కౌంటర్‌ దాడులు జరపడంతో ఆశిష్‌ అతను సహచరుడు తీవ్రంగా గాయపడి పట్టుబడ్డారు. ఈ మేరకు అలీపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆశిష్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఐతే ఆశిష్‌కి నవంబర్‌3, 2020న బెయిల్‌ మంజూరయ్యింది. కానీ కోర్టు నిబంధనలను ఉల్లంఘించడంతో నాన్‌ బెయిల్‌ వారెంట్‌ జారీ చేసి మళ్లీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలాగే అతని సోదరుడు కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్న 23 ఏళ్ల దీపక్‌ తన సహచర ఉద్యోగినే అత్యాచారం చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎట్టకేలకు పోలీసుల జరిపిన దర్యాప్తులో ఆశిష్‌ సోదరుడు దీపక్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

(చదవండి: ఉసురు తీసిన అతివేగం...ఆటోను ఢీ కొట్టిన ట్రక్కు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement