వీడియోలతో 15 ఏళ్లుగా బ్లాక్‌మెయిల్‌.. దాంతో

Madhya Pradesh Woman Allegedly Stabs Man 25 Times To Death - Sakshi

భోపాల్‌: లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిపట్ల ఓ మహిళ అపర కాళికలా మారింది. అతనిపై తిరబడి కత్తితో 25 పోట్లు పొడిచింది. నేరుగా వెళ్లి పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయింది. తీవ్ర గాయాలతో ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈఘటన మధ్యప్రదేశ్‌లోని గుణలో గత సోమవారం జరిగింది. మృతున్ని బ్రిజ్‌భూషన్‌ శర్మగా గుర్తించామని పోలీసులు తెలిపారు. అశోక్‌ నగర్‌లో నివాసముండే శర్మ తనపై గత 15 ఏళ్లుగా అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. తనకు 16 ఏళ్లు ఉన్నప్పుడు శర్మ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, దాంతోపాటు ఆ వీడియోలు తీసి ఇన్నేళ్లుగా బ్లాక్‌మెయిల్‌ చేశాడని తెలిపింది. 
(చదవండి: ప్రేమ పేరుతో.. పలుమార్లు అత్యాచారం)

పెళ్లి చేసుకుని తన బతుకు తాను బతుకున్నా విడిచిపెట్టలేదని వాపోయింది. ఆనాటి వీడియోతో నిత్యం వేధిస్తున్నాడని, ఘటన జరిగిన రోజు కూడా అతని తీరు మారలేదని తెలిపింది. పని నిమిత్తం తన భర్త బయట వెళ్లాడని, అదే సమయంలో తప్పతాగి వచ్చిన శర్మ తనపై అఘాయిత్యానికి పూనుకున్నాడని చెప్పింది. తీవ్ర ఆగ్రహావేశంతో అతనిపై కత్తితో దాడి చేసి చంపేశానని వెల్లడించింది. ఆ కామాంధుడి వల్ల తన జీవితం నాశనమైందని, తన ఇద్దరు పిల్లలు, భర్తకు దూరంగా జైలు జీవితం గడపాల్సిన దుస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, నిందితురాలిపై మర్డర్‌ కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం ఆమెను కోర్టులో ప్రవేశ పెట్టారు.
(చదవండి: కన్నేసి... కాటేసి..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top