HYD: మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ | IT Company Fruad At Hyderabad Madhapur | Sakshi
Sakshi News home page

HYD: నిరుద్యోగులకు టోకరా.. మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ

Aug 17 2024 9:12 PM | Updated on Aug 17 2024 9:12 PM

IT Company Fruad At Hyderabad Madhapur

సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు దండుకుని మాదాపూర్‌లోని మరో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో, మోసపోయామని భావించిన దాదాపు 200 మంది నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

వివరాల ప్రకారం.. అయ్యప్ప సొసైటీలో ఫ్రైడే అప్‌ కన్సెల్టెన్సీ కంపెనీ నిరుద్యోగులకు టోకరా ఇచ్చింది. ఉద్యోగం ఆశ చూపించి దాదాపు 200 మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి రూ.1.50లక్షల చొప్పున వసూలు చేసింది సదరు కంపెనీ. ఇలా.. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించింది.

ఈ క్రమంలో శిక్షణ అనంతరం ప్లేస్‌మెంట్‌ ఇప్పించినట్టు నమ్మించి జీతాలు ఇవ్వకుండా మోసం చేసింది. అనంతరం.. కార్యాలయానికి ఉన్న పళంగా తాళం వేయడంతో బాధితులు ఒక్కసారిగా ఖంగుతున్నారు. దీంతో, మోసపోయామని గ్రహించిన బాధితులు శనివారం మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ  కంపెనీకి బెంగళూరు, విజయవాడలో కేంద్రాలు ఉన్నట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement