
హైదరాబాద్: మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయ్యింది. నగరంలో గ్రిండర్ యాప్ ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్న ముఠాను పోలీసులు గుర్తించారు. ఇది సాధారణంగా గే డేటింగ్ యాప్‌గా ఉపయోగించబడుతుంది. కానీ కొందురు దీన్ని డ్రగ్స్ విక్రయానికి వేదికగా మార్చారు. ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ వ్యవహారాన్ని రట్టుచేసి 10 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లు ఉండగా, మరో 8 మంది డ్రగ్స్ వినియోగదారులున్నారు.

డ్రగ్స్ వినియోగిస్తున్న వారంతా స్వలింగ సంపర్కులుగా తేలింది. దీనికి సంబంధించి 100 గ్రాముల ఎమ్‌డీఏ(ఎక్స్‌టసీ) స్వాధీనం చేసుకున్నారు. ఆ యాప్‌లో రహస్య కోడ్‌లు ఉపయోగిస్తూ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ ముఠాకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో డ్రగ్స్ సప్లై చేస్తున్న నైజరీయన్ నుంచి ఇద్దరు పెడ్లర్లు కొనుగోలు చేస్తూ అవసరమైన వారికి అందిస్తున్నారు. దీనికి గ్రైండర్ అనే యాప్‌ను వినియోగిస్తూ సింబల్స్ సాయంతో డోర్ డెలివరీ చేస్తున్నారు. దీనిపై డీసీపీ బాలాస్వామి మాట్లాడుతూ.. నిందితులు, కన్జ్యూమర్లలో కొందరికి హెచ్‌ఐవీ ఉన్నట్లు డీసీపీ బాలాస్వామి తెలిపారు.