బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను హత్య చేసిన భర్త | Husband Kills Wife At Bachupally Hyderabad And Tries To Dismember Body, Details Inside | Sakshi
Sakshi News home page

బాచుపల్లిలో దారుణం.. భార్యను హత్య చేసి, గ్యాస్‌ లీకేజ్‌ ప్రమాదంగా..

Published Fri, May 24 2024 9:14 PM

Husband Kills Wife At Bachupally HYD

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని బాచుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యను భర్తతో కత్తితో హత్య చేశాడు. మే 5న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాలు.. సాయి అనురాగ్‌ కాలనీలో నాగేంద్ర భరద్వాజ్‌, అతని భార్య సాఫ్ట్‌వేర్‌ ఇంజరీర్‌గా పనిచేస్తున్న మధులతతో కలిసి జీవిస్తున్నాడు. ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 5వ తేదీన ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరగడంతో నాగేంద్ర కోపంతో రగిలిపోయాడు. భార్య మధులతను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని  ముక్కలుగా చేయడానికి ప్రయత్నంచగా విఫలమయ్యాడు

దీంతో  గ్యాస్ లీకేజ్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఇవేవి ఫలించకపోవడంతో చివరికి తాను కత్తితో కోసుకొని హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మధులత తండ్రి రంగనాయకులు పిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement