పెళ్లిలో తుపాకీ పేల్చిన వధువు..  నాలుగు రౌండ్ల కాల్పులు.. వీడియో వైరల్ | Sakshi
Sakshi News home page

పెళ్లిలో తుపాకీ పేల్చిన వధువు..  నాలుగు రౌండ్ల కాల్పులు.. వీడియో వైరల్..

Published Sun, Apr 9 2023 5:31 PM

UP Hathras Bride Fires Bullets During Wedding Ceremony Viral Video - Sakshi

లక్నో: ఓ వధువు తన పెళ్లి వేడుకలో తుపాకీతో హల్‌చల్ చేసింది. వరుడి పక్కనే కూర్చొని గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఉత్తర్‌ప్రదేశ్ హథ్రాస్‌లోని సాలెంపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్టేడీపై ఉన్న వధవు దగ్గరకు వెళ్లి తుపాకీ ఇచ్చాడు. దీంతో ఆమె దాన్ని తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపింది. అనంతరం తుపాకీ తిరిగి ఇచ్చేసింది. ఈ సమయంలో వరుడు కూడా ఆమె పక్కనే ఉన్నాడు. కదలకుండా కూర్చున్నాడు తప్ప వద్దని గానీ, ఆపమని గానీ చెప్పలేదు.

అయితే వధువు తుపాకీ పేల్చిన వీడియోను ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌ అయింది.  దీంతో పోలీసులు ఈ ఘటనపై దృష్టి సారించారు. కాల్పులకు సంబంధించి విచారణ చేపట్టారు.
చదవండి: గ్యాంగ్‌స్టర్ల ప్యాంట్లు తడిసిపోతున్నాయ్.. మాఫియా వణికిపోతోంది: సీఎం యోగి

Advertisement
 
Advertisement