విషాదం: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య | Four Members Family Ends Life In Kurnool District | Sakshi
Sakshi News home page

నంద్యాలలో విషాదం: ఇద్దరు కుమార్తెలతో దంపతుల ఆత్మహత్య

Apr 28 2021 9:27 AM | Updated on Apr 28 2021 12:32 PM

Four Members Family Ends Life In Kurnool District - Sakshi

సాక్షి, కర్నూలు: నంద్యాల మాల్దార్‌పేటలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కుమార్తెలతో పాటు దంపతులు పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మృతి చెందిన వారు శేఖర్‌, కళావతి, అంజలి(16), అఖిల(14)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధతోనే వారు ఆత్మహత్య చేసుకోవచ్చని స్థానికులు చెబుతున్నారు.


చదవండి: కరోనా: బెడ్డు దొరక్క కాబోయే వరుడు మృతి 

Advertisement
 
Advertisement
Advertisement