జియో కస్టమర్‌ కేర్‌ పేరిట సైబర్‌ మోసం

Cyber Fraud Over Jio Customer Care Service - Sakshi

సాక్షి, హైదరబాద్‌ : జియో కస్టమర్‌ సర్వీస్‌ పేరిట కొత్తరకం మోసానికి తెరతీశారు సైబర్‌ నేరగాళ్లు. జియో కస్టమర్లకు ఫోన్‌ చేసి ‘మీ సిమ​ బ్లాక్‌ అవుతుంది. వెంటనే రీఛార్జ్‌ చేయాలి’ అంటూ కస్టమర్‌ కేర్‌నుంచి ఫోన్‌ చేసినట్లుగా నమ్మిస్తున్నారు. రిమోట్‌ యాక్సె్‌స్‌ యాప్‌ ద్వారా రిఛార్జ్‌ చేయాలని చెబుతున్నారు. ఆ యాప్‌ ద్వారా కస్టమర్ల అకౌంట్లలోంచి డబ్బులు మాయం చేస్తున్నారు. ఇద్దరు మహిళలనుంచి 2.7లక్షల రూపాయలు దోచేశారు. ఈ మేరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జియో కస్టమర్లు సైబర్‌ చీటర్స్‌ నుండి అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top