
తాడిపత్రి అర్బన్: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం జూటూరు గ్రామంలో సోమవారం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి ఘటనకు సంబంధించి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు 13 మందిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వి.ఎన్.కె.చైతన్య తెలిపారు. జేసీ వర్గీయుల దాడిలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎర్రగుడి రామ్మోహన్‌రెడ్డి, వినయ్‌కుమార్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, ప్రతాపరెడ్డి, సత్యనారాయణరెడ్డి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
ఈ ఘటనకు సంబంధించి ఎర్రగుడి రామ్మోహన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిని కుట్రదారుగా పేర్కొన్నారు. జేసీతో పాటు ఎ.నారాయణరెడ్డి, జేసీ చిత్తరంజన్‌రెడ్డి, జేసీ శశిధర్‌రెడ్డి, కె.ఓబిరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, శివశంకర్‌రెడ్డి, దేవరాజు, ఎ.వరప్రసాద్‌రెడ్డి, కె.రామలింగారెడ్డి, వై.ఓబిరెడ్డి, మరొకరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.