
సాక్షి, హైదరాబాద్: గత నెల 23న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్టూడియోలో జరిగిన చర్చా వేదికలో శ్రీనివాసరావు పథకం ప్రకారం తనపై చెప్పుతో దాడి చేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందస్తు పథకం ప్రకారమే చర్చలో పాల్గొన్న శ్రీనివాసరావు తన ప్రతిష్టను దెబ్బతీశారన్నారు. ఈ వ్యవహారంతో తాను భౌతికంగా, మానసికంగా కలత చెందానని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.