
బనశంకరి(చెన్నై): నగరంలో ఉబర్ క్యాబ్ డ్రైవరు మహిళా ప్రయాణికురాలితో అనుచితంగా ప్రవర్తించినట్లు బాధితులు ఫిర్యాదు చేసింది. వివరాలు.. నగరంలో బీటీఎం లేఔట్ రెండో స్టేజ్ నుంచి జేపీ.నగర మెట్రోస్టేషన్ వరకు ప్రయాణించడానికి ఒక మహిళ ఉబర్ ట్యాక్సీని బుక్‌చేసింది. డ్రైవరు మ్యాప్ ఆధారంగా వెళ్లకుండా మరో మార్గంలో వెళ్తుండగా, మ్యాప్ మేరకు వెళ్లాలని మహిళ కోరారు.
కానీ డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో మహిళ తనను తీసుకువచ్చిన స్థలంలో వదిలిపెట్టాలని, ఆ డబ్బులను చెల్లిస్తానని చెప్పింది. సమ్మతించని డ్రైవరు మహిళతో అనుచితంగా ప్రవర్తించినట్లు తెలిసింది. బాధితురాలు సోషల్ మీడియాలో ఈ ఘటనను వివరించింది. డ్రైవర్ తీరుతో భయభ్రాంతులకు గురై ఎలా తప్పించుకుని జనసందడి ఉన్న ప్రాంతంలోని వచ్చానని తెలిపింది. దీనిపై ఉబర్ సంస్థ స్పందిస్తూ ఆ డ్రైవరును గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.