ప్రేమోన్మాది ఘాతుకం | Assassination incident in kurnool | Sakshi
Sakshi News home page

ప్రేమోన్మాది ఘాతుకం

Oct 19 2024 5:37 AM | Updated on Oct 19 2024 5:37 AM

Assassination incident in kurnool

ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య 

ప్రేమించడం లేదని బలవంతంగా 

పురుగుమందు తాగించి చంపేశాడు  

కర్నూలు జిల్లాలో కిరాతకం

ఆదోని రూరల్‌:  కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన అశ్విని అనే ఇంటర్మీడియెట్‌ విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో బలైంది. విద్యార్థిని నోట్లో పురుగుల మందు పోసి హత్యచేసిన ఘటన శుక్రవారం నగరూరు గ్రామంలో కలకలం రేపింది.  విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నరసమ్మ, చిన్న వీరేష్‌ దంపతుల ఏకైక కుమార్తె అశ్విని పత్తికొండ మోడల్‌ స్కూల్‌లో ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. 

దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థి సన్నీ  శుక్రవారం అశ్విని ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. తనను ప్రేమించకపోతే చంపేస్తానని వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా చూపుతూ ఆమెను బెదిరించాడు. అయినప్పటికీ బాలిక అతని మాట లెక్కచేయకపోవడంతో సన్నీ ఆమె నోట్లో బలవంతంగా పురుగు మందు పోసి పరారయ్యాడు. 

కొద్దిసేపటికి విద్యార్థిని తల్లిదండ్రులు పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి  కుమార్తె చావుబతుకుల్లో కనిపించింది. సన్నీ అనే వ్యక్తి బలవంతంగా పురుగు మందు తాగించాడని తల్లిదండ్రులకు తెలిపింది. వారు వెంటనే ఆమెను ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.  

Advertisement
 
Advertisement
Advertisement