కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం..

Assassination Attempted On Woman In Kamareddy - Sakshi

మహిళపై హత్యాయత్నం

గొంతు కోసి పరారైన ఆగంతకుడు

సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని బర్కత్ పుర కాలనీలో దారుణం జరిగింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఓ వివాహితపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఆమె గొంతు కోసి పరారయ్యాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నిషాక్ ఫిర్దొస్‌ను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ నిషాక్ ఫిర్దొస్ మాట్లాడితేనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top