ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌లో మహిళ పై సీనియర్‌ ఉద్యోగి వేధింపులు | Air Force Officer Sexual Harassment On Women In Hyderabad | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌లో మహిళ పై సీనియర్‌ ఉద్యోగి లైంగిక వేధింపులు

May 5 2021 10:49 AM | Updated on May 5 2021 1:08 PM

Air Force Officer Sexual Harassment On Women In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అల్వాల్‌(హైదరాబాద్‌): పనిచేసే చోట ఉన్నత ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ పరుశురాం తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్‌లో నివసించే ఓ మహిళ(35) హకీంపేట్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ఉద్యోగం చేస్తోంది.

కొన్ని రోజులుగా తన సీనియన్‌ ఉద్యోగి ఎస్‌.కె.శర్మ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, రక్షణ కల్పించాలని కోరుతూ ఎయిర్‌ఫోర్స్‌ ప్రధాన గేటువద్ద ధర్నా చేసింది. అనంతరం అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement