breaking news
airforce staff
-
ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో మహిళ పై సీనియర్ ఉద్యోగి వేధింపులు
సాక్షి, అల్వాల్(హైదరాబాద్): పనిచేసే చోట ఉన్నత ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ పరుశురాం తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్‌లో నివసించే ఓ మహిళ(35) హకీంపేట్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఉద్యోగం చేస్తోంది. కొన్ని రోజులుగా తన సీనియన్ ఉద్యోగి ఎస్.కె.శర్మ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, రక్షణ కల్పించాలని కోరుతూ ఎయిర్‌ఫోర్స్ ప్రధాన గేటువద్ద ధర్నా చేసింది. అనంతరం అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిర్‌ఫోర్స్ సిబ్బందికి సోకిన స్వైన్‌ఫ్లూ
తెలంగాణ రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ విజృంభణ ఇంకా తగ్గలేదు. సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలోని కొంతమంది ఎయిర్‌ఫోర్స్ సిబ్బందికి కూడా ఈ వ్యాధి సోకింది. ఆదివారం ఒక్కరోజే 52 కొత్త స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటివరకు ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య అధికారిక లెక్కల ప్రకారమే 25కు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 390 స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి నియంత్రణ గురించి పట్టించుకోలేదనే వైద్యారోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య పదవి కూడా ఊడిపోయిన సంగతి తెలిసిందే.