ఎయిర్ఫోర్స్ సిబ్బందికి సోకిన స్వైన్ఫ్లూ | airforce staff suffering from swine flu | Sakshi
Sakshi News home page

ఎయిర్ఫోర్స్ సిబ్బందికి సోకిన స్వైన్ఫ్లూ

Jan 26 2015 10:29 AM | Updated on Sep 2 2017 8:18 PM

ఎయిర్ఫోర్స్ సిబ్బందికి సోకిన స్వైన్ఫ్లూ

ఎయిర్ఫోర్స్ సిబ్బందికి సోకిన స్వైన్ఫ్లూ

సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలోని కొంతమంది ఎయిర్ఫోర్స్ సిబ్బందికి స్వైన్ ఫ్లూ వ్యాధి సోకింది.

తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ఫ్లూ విజృంభణ ఇంకా తగ్గలేదు. సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలోని కొంతమంది ఎయిర్ఫోర్స్ సిబ్బందికి కూడా ఈ వ్యాధి సోకింది. ఆదివారం ఒక్కరోజే 52 కొత్త స్వైన్ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మరణించారు.

దీంతో ఇప్పటివరకు ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య అధికారిక లెక్కల ప్రకారమే 25కు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 390 స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి నియంత్రణ గురించి పట్టించుకోలేదనే వైద్యారోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య పదవి కూడా ఊడిపోయిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement