కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో మే 5వ తేదీన సంకటహర గణపతివ్రతాన్ని నిర్వహించనున్నట్లు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ఉదయం 9 నుంచి 10, 11 నుంచి 12గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6గంటల వరకు వ్రతం జరుగుతుందన్నారు. రాత్రి 7 గంటలకు స్వర్ణ రథోత్సవం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
అభివృద్ధిబాటలో
సహకార సంఘం
యాదమరి: యాదమరి సహకార సంఘాన్ని స్థానిక సింగిల్‌విండో సొసైటీ రైతు ఉత్పత్తిదారుల సంస్థగా అభివృద్ధి చేయడానికి తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా ప్రాజెక్టు డెవలప్‌మెంట్ మేనేజర్ ఉదయ్‌కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన స్థానిక సొసైటీలో చైర్‌పర్సన్ చిత్రానాయుడు అధ్యక్షతన కెనడాకు చెందిన ప్రతినిధులు శ్రీకాంత్, వసుమతి, రామ్‌కిరణ్, రమ్యతో సమావేశమయ్యారు. ప్రతినిధులు మాట్లాడుతూ యాదమరి సంఘ అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చిత్రానాయుడు మాట్లాడుతూ రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి ప్రభుత్వ రాయితీలు పొందాలని కోరారు. సమావేశంలో సీఈఓ గుణశేఖర్, సిబ్బంది సిరాజ్‌బాషా పాల్గొన్నారు.
తుంగభద్ర వారియర్స్ టీంకు చరణ్‌జిత్ ఎంపిక
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు క్రీడారంగంలో మరో మైలురాయి నమోదైంది. ప్రతిష్టాత్మకమైన ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఆడేందుకు చిత్తూరు నగరానికి చెందిన యువ క్రికెటర్ జీ.వి.చరణ్‌జిత్ ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో తుంగభద్ర వారియర్స్ జట్టు చరణ్‌జిత్‌ను దక్కించుకుంది. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి లీగ్‌కు ఎంపిక కావడం పట్ల క్రీడాకారులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కఠోర శ్రమకు ఫలితం
నగరంలోని జిల్లా క్రీడా ప్రాంగణంలో ఉన్న సీసీఎఫ్‌లో చరణ్‌జిత్ సుదీర్ఘకాలంగా శిక్షణ పొందుతున్నారు. కోచ్‌లు జాకీర్, రాకేష్, అకీబ్‌ల పర్యవేక్షణలో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. రైట్‌హ్యాండ్ బ్యాటింగ్‌తో పాటు, ఆఫ్ స్పిన్నర్ గా ఆల్‌రౌండర్ ప్రతిభ కనబరుస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. కోచ్‌లు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా నుంచి తుంగభద్ర టీమ్‌కు చరణ్‌జిత్ ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఎంపిక వార్త తెలిసిన వెంటనే మంగళవారం చిత్తూరులోని సీసీఎఫ్ క్రీడా మైదానంలో క్రీడాకారులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.


