షోకాజ్‌ నోటీస్‌! | - | Sakshi
Sakshi News home page

షోకాజ్‌ నోటీస్‌!

Apr 29 2026 8:06 AM | Updated on Apr 29 2026 8:06 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా విద్యాశాఖలో మరో వివాదం ముదిరింది. పదో తరగతి జవాబు పత్రాల మూ ల్యాంకన ప్రక్రియలో కీలక బాధ్యతలో ఉన్న ఒక అధికారి ప్రవర్తన ప్రస్తుతం చర్చనీయాంశంగా మా రింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా, ఒక మహిళా ఉపాధ్యాయురాలి పట్ల దు రుసుగా ప్రవర్తించారనే ఆరోపణల పై ఏపీ ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌, డిప్యూటీ క్యాంప్‌ ఆఫీసర్‌ స్ట్రాంగ్‌ రూం జయప్రకాష్‌నాయుడుకు జిల్లా అబ్జర్వర్‌ మువ్వారామలింగం షోకాజ్‌ నోటీసు జారీచేశారు.

ఏమిటా వివాదం ?

పీసీఆర్‌ పాఠశాలలో మూల్యాంకన సమయంలో స్ట్రాంగ్‌ రూమ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న జయప్రకాష్‌నాయుడు మూల్యాంకన విధులకు హాజరైన ఒక మహిళా టీచర్‌ను దూషించినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. ఆ ఆరోపణలపై పలు పత్రికల్లో వార్తలు కూడా ప్రచురితమయ్యాయి. క్రమశిక్షణా రాహి త్యానికి పాల్పడటంపై సీరియస్‌గా పరిగణించి షోకాజ్‌ నోటీసు జారీచేసినట్లు పేర్కొన్నారు.

విద్యాశాఖలో చర్చ

బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడంపై విద్యాశాఖ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. విచారణలో నిజానిజాలు తేలితే సదరు అధికారిపై వేటు పడటం ఖాయమని తెలుస్తోంది. పరీక్షల నిర్వహణ లో పారదర్శకత, మహిళా ఉద్యోగుల భద్రత విషయంలో రాజీపడేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement