గుడిపాలలో ఏనుగుల గుంపు | - | Sakshi
Sakshi News home page

గుడిపాలలో ఏనుగుల గుంపు

Apr 29 2026 8:06 AM | Updated on Apr 29 2026 8:06 AM

గుడిపాల: ఏనుగుల గుంపు మళ్లీ తమిళనాడు నుంచి గుడిపాల మండలానికి చేరుకుంది. మంగళవారం చిత్తూరు–వేలూరు రహదారి మద్రాస్‌ క్రాస్‌ రోడ్డుకు సమీపంలో ఏనుగుల గుంపు కనిపించింది. అటవీశాఖ అధికారులు ముందస్తుగా అటవీ ప్రాంత సమీపంలో ఉన్న రైతులను అప్రమత్తం చేశారు. పంట పొలాలపైకి రాకుండా టపాకాయలు పేల్చి అటవీ ప్రాంతంలోనే ఉండే విధంగా చూస్తామని పారె స్ట్‌ అధికారులు చెబుతున్నారు. వీలైనంత త్వర లో తమిళనాడుకు తరలిస్తామని తెలిపారు.

చెరువులో పడి వ్యక్తి మృతి

తవణంపల్లె: మండలంలో ని కామాలూరు సమీపంలోని చెరువులో ఓ వ్యక్తి ప డి మృతి చెందినట్లు తవణంపల్లె ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. ఎస్‌ఐ కథనం.. పులిచెర్ల మండలం, వెంకటాద్రిపల్లె దళితవాడకు చెందిన వెంకట్రమణ కుమారుడు వి.భాస్కర్‌(35) కూలి పను లు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత రెండేళ్లుగా కామాలూరుకు చెందిన లలితతో కలసి ఉంటున్నాడు. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమ వారం భాస్కర్‌ మద్యం సేవించి వచ్చాడు. ఇంటికి సమీపంలో ఉన్న కొత్త చెరువు దగ్గర లలిత, భాస్కర్‌ మరోసారి గొడవలు పడుతూ చెరువులో పడిపోయారు. గమనించిన స్థానికులు లలితను కాపాడి చెరుగు గట్టుకు లాగారు. భాస్కర్‌ చెరువులో మునిగిపోయి మృతి చెందాడు. మృతుని తండ్రి వెంకట్రమణ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement