శిథిలావస్థలో వాటర్‌ ట్యాంక్‌ | - | Sakshi
Sakshi News home page

శిథిలావస్థలో వాటర్‌ ట్యాంక్‌

Apr 2 2026 7:47 AM | Updated on Apr 2 2026 7:47 AM

గంగాధర నెల్లూరు: వాటర్‌ ట్యాంకు శిథిలావస్థకు చేరిందని, దాన్ని తొలగించి కొత్తదాన్ని నిర్మించాలని మండలంలోని నందనూరు గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ ట్యాంకు నుంచి నందనూరు, దళితవాడలోని దాదాపు 200 కుటుంబాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. దీన్ని అనేక ఏళ్ల క్రితం నిర్మించారు. తర్వాత మరమ్మతులు చేపట్టలేదు. దీంతో శిథిలావస్థకు చేరింది. స్తంభాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పైకప్పు పెచ్చులు ఊడడంతో ఇనుప కమ్మీలు కనిపిస్తున్నాయి. అధికారులు స్పందించి ట్యాంకును కూలదోసి నూతన ట్యాంకు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement