దేవునితో రాజకీయాలు దురదృష్టం | - | Sakshi
Sakshi News home page

దేవునితో రాజకీయాలు దురదృష్టం

Mar 18 2026 11:07 AM | Updated on Mar 18 2026 11:07 AM

– మాజీ మంత్రి ఆర్‌కే రోజా

పుత్తూరు: దేవునితో రాజకీయాలు చేయడం దుర దృష్టకరమని, ఆలయాల వద్ద పాలిటిక్స్‌కు స్థానమే లేదని మాజీ మంత్రి ఆర్‌కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పుత్తూరులోని శ్రీధర్మరాజస్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ద్రౌపదీ దేవి 40 అడుగుల భారీ విగ్రహానికి పూజలు చేశా రు. అనంతరం రోజా మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు ఆలయాల వద్ద సైతం కుటిల రాజకీయాలకు తెగబడుతున్నారని ఆరోపించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ద్రౌపదీదేవి రాజగోపురానికి రూ.20 లక్షలను మంజూరు చేయించామని, మరో రూ.5లక్షల సొంత నిధులు అందించామని, మొ త్తం రూ.25లక్షలతో నిర్మాణం పూర్తి చేశామని వెల్లడించారు.అలాగే అమ్మవారి గర్భగుడిని సైతం ఆధు నికీకరించామన్నారు. అప్పట్లో ఆలయ జీర్ణోద్ధరణ, అష్టబంధన, మహాకుంభాభిషేకంలో రాజకీయాలకు అతీతంగా అందరినీ భాగస్వాములను చేశామ ని తెలిపారు. అయితే ఆలయ ఆవరణలో తాము ఆవిష్కరించిన శిలాఫలకాన్ని ప్రస్తుత పాలకులు అహంకారంతో ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తర్వాత అమ్మవారి విగ్రహ ప్రతిష్టను సైతం పార్టీ కార్యక్రమంగా నిర్వహించి భక్తులను అవమానించారని విమర్శించారు. ఇప్పటికై నా బుద్ధి తెచ్చుకుని దేవాలయాల్లో రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సూచించారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఆనంగి హరి, వైస్‌ చైర్మన్‌ డి.జయప్రకాష్‌, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు ఏకాంబరం, బీసీ సెల్‌ పట్టణ అధ్యక్షుడు వెంకటేశులు, నేతలు రవీంద్ర, రాజేశ్వరి, మునిరత్నం, చక్రి, బాలాజీ, గుణ, ఈశ్వ రయ్యయాదవ్‌, ప్రవీణ్‌, దిలీప్‌కుమార్‌, కుట్టి, లారీ మోహన్‌, మనోహర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివలింగం, సుబ్రమణ్యం, చిన్నా, శివ, శీనా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement