‘మురుగు’ ఆలోచనలొద్దు? | - | Sakshi
Sakshi News home page

‘మురుగు’ ఆలోచనలొద్దు?

Mar 17 2026 7:41 AM | Updated on Mar 17 2026 7:41 AM

మురుగునీటి శుద్ధి కేంద్రం

ఏర్పాటుకు ప్రణాళికలు

స్థల పరిశీలన చేసిన అధికారులు

రెండు ఎకరాల భూసేకరణకు ప్రయత్నాలు

అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రైతులు, ట్రేడర్లు

జేడీకి ఫిర్యాదు

రైతులను ముంచేస్తారా..?

మామిడి కాయల మార్కెట్‌ యార్డుకు 40 ఏళ్లుగా వస్తూ పోతున్నాం. రైతులకు అనువైనా స్థలం. ఇక్కడ మురుగునీటి శుద్ధ కేంద్రం ఏర్పాటు చేస్తే..రైతులకు ఇబ్బంది తప్పదు. కాయలు తోలుకొస్తే..ఇక్కడ ఎలా ఉండాలి. రాత్రి పగలు...ఇక్కడే పడి ఉంటాం. ఆ కంపును భరించలేం. మామిడి కాయల మార్కెట్‌లో ఆ కేంద్రం వద్దు. ఊరు చివరన పెట్టండి.

– దొరస్వామి, మామిడి రైతు, చిత్తూరు

ప్లాంట్‌ వద్దు

మార్కెట్‌ యార్డులో కొన్నేళ్లుగా ట్రేడర్‌ నడుపుతున్నాం. ఏడాదిలో నాలుగు నెలలు మార్కెట్‌ రద్దీగా కనిపిస్తోంది. లారీలు వచ్చి క్యూకడతాయి. వాటికి సరిపడినంత స్థలం ఉంది. రెండు ఎకరాల స్థలం మురుగు నీటి శుద్ధ కేంద్రానికి ఇచ్చేస్తే.. మార్కెట్‌ స్థలం కుంచించుకుపోతుంది. మామిడి వ్యాపారాలకు అంతరాయం ఏర్పడుతోంది. – రత్నంరెడ్డి, ట్రేడర్‌, చిత్తూరు

చిత్తూరు రూరూల్‌ (కాణిపాకం): చంద్రబాబు సర్కార్‌ వ్యవసాయ మార్కెట్‌ను నిర్వీర్యం చేసేందుకు కుట్రపన్నుతోంది. మార్కెట్‌ స్థలంలో మురుగు నీటి శుద్ధ కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతు కార్యకలపాలను భ్రష్టు ప ట్టించేలా చూస్తోంది. మురుగునీటి శుద్ధ కేంద్ర ఏర్పా టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ...మార్కెటింగ్‌ శాఖ జేడీకి సోమవారం ట్రేడర్లు, రైతులు ఫిర్యాదు చేశారు.

మామిడి వ్యాపారానికి కీలక కేంద్రం

చిత్తూరు జిల్లా మామిడి పండ్ల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంది. పంటను చిత్తూరు నగరంలోని కట్టమంచి వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. మామిడి సీజన్‌ సమయంలో ఈ మార్కెట్‌ యార్డు రైతులకు ప్రధాన వ్యాపార కేంద్రంగా మారుతుంది. ప్రతి ఏటా ఏప్రిల్‌ నుంచి జూలై వరకు నాలుగు నెలల పాటు మార్కెట్‌ యార్డులో మామిడి వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈ సమయంలో రోజువారీగా సుమారు 50 లారీలలో మామిడి పండ్లు లోడింగ్‌ చేసి రాజస్థాన్‌, హర్యానా, గుజరాత్‌ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ వ్యాపారం ద్వారా వేలాది మంది రైతులు, కూలీలు, వ్యాపారులు జీవనం సాగిస్తున్నారు. మార్కెట్‌ యార్డులో మొత్తం 43 షాపులు ఉండగా, అందులో సుమారు 34 షాపులు నడుస్తున్నాయి. అయితే అత్యంత విలువైన ఈ మార్కెట్‌ యార్డులోనే మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు ప్రణాళికలు జరగుతున్నాయి. మార్కెట్‌ స్థలంలో ఈ కేంద్రం ఏర్పాటు చేస్తే వ్యాపార కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతింటాయని పలువురు పేర్కొంటున్నారు.

మురుగునీటి శుద్ధి కేంద్రమంటే?

ఇళ్ల నుంచి, డ్రైనేజీ లైన్ల నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసే కేంద్రాన్ని మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్‌టీపీ) అంటారు. ఈ కేంద్రంలో మురుగు నీటిలో ఉన్న చెత్త, మలినాలను ప్రత్యేక పద్ధతుల్లో తొలగించి నీటిని శుభ్రం చేస్తారు. శుద్ధి చేసిన నీటిని తోటలు, పార్కు లు, పరిశ్రమల అవసరాలకు వినియోగిస్తారు. పట్టణాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభు త్వం ఈ కేంద్రా లను ఏర్పాటు చేస్తుంది. అయి తే నివాస ప్రాంతాలు లేదా వ్యాపార ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే అసౌకర్యం తలెత్తే అవకాశం ఉందని స్థానికులు చెబు తున్నారు.

వ్యాపారాలకు ఆటంకం

మార్కెట్‌ యార్డు స్థలంలో రెండు ఎకరాల భూమిని మురుగునీటి శుద్ధి కేంద్రం కోసం కేటాయిస్తే వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని రైతులు, ట్రేడర్లు చెబుతు న్నారు. ముఖ్యంగా మామిడి సీజన్‌ సమయంలో పెద్ద సంఖ్యలో లారీలు మార్కెట్‌ యార్డు కు వచ్చి పోతుంటాయి. ఇలాంటి సమయంలో స్థలం తగ్గిపోతే వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మార్కెట్‌ యార్డులో ప్రస్తుతం వ్యాపారస్తులు కూడా ఈ ప్రతిపాదనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణం జరిగి తే తమ దుకాణాలను తరలించాల్సివస్తుందని, అప్పుడు వ్యాపారం కొనసాగించడం కష్టమవుతుందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతుల నుంచి పంట కొనుగోలు చేయడం కూ డా నిలిచిపోవచ్చని అంటున్నారు. చుట్టుపక్క ల నివసిస్తున్న ప్రజలకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు.

నగర శివారులో ఏర్పాటు చేయాలి

మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని మార్కెట్‌ యార్డు లో కాకుండా నగర శివారు ప్రాంతాల్లో లేదా అనువైన ఇతర ప్రాంతంలో ఏర్పాటు చేయాల ని రైతులు, ట్రేడ ర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో విజయ డెయిరీ, చక్కెర ఫ్యాక్టరీలు, మత్స్యశాఖ ఆస్తుల తర్వాత ఇప్పుడు మార్కెట్‌ యార్డు స్థలంపై కూడా కన్నేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

రైతులు, ట్రేడర్ల సమావేశం

మార్కెట్‌ స్థలం

ధారాదత్తం చేసే కుట్ర

ఈ విషయంపై సోమవారం మార్కెట్‌ యార్డు లో రైతులు, ట్రేడర్లు సమావేశమయ్యారు. మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికా రుల దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని నిర్ణయించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. రీజినల్‌ మార్కెటింగ్‌ శాఖ జేడీ రామాజంనేయులను కలసి వినతి పత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement