కలెక్టరేట్‌కు పోటెత్తిన అర్జీదారులు
● అర్జీలు స్వీకరించిన ఇన్‌చార్జ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్
చిత్తూరు కలెక్టరేట్: సమస్యలు పరిష్కరించండి సారూ..! అంటూ పలువురు అర్జీదారులు ఉన్నతాధికారులను వేడుకున్నా రు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారులు ఉన్నతాధికారుల ఎదుట తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్ర న్ మాట్లాడుతూ ప్రజల అర్జీలను సత్వరం పరిష్కరించేలా క్షేత్రస్థా యి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. డీఆర్‌వో మోహన్‌కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
భూ సేకరణపై ఆందోళన
కుప్పం ప్రాంతంలో విమానాశ్రయాన్ని నిర్మించేందుకు చేస్తున్న భూ సేకరణ ప్రక్రియలో భూ బాధితులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌బాబు, చిత్తూరు నియోజకవర్గం ఇన్‌చార్జ్ టిక్కిరాయల్‌లు డిమాండ్ చేశారు. ఆ పార్టీ నాయకులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ బాధితులకు ముందుగా ప్రభుత్వం నిర్ధేశించిన పరిహారం పూర్తిగా చెల్లించిన తర్వాతే భూ సేకరణ ప్రక్రియను చేపట్టాలన్నారు. ఒక వేళ పరిహారం అందజేయకుండా భూ సేకరణకు ప్రయత్నిస్తే, పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
ఇన్‌చార్జ్ కలెక్టర్‌కు సమస్యలు మొరపెట్టుకుంటున్న అర్జీదారులు
న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు


