రొంపిచెర్ల: రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగికి తీవ్ర గాయాలైన ఘటన అన్నమయ్య– చిత్తూ రు జిల్లా సరిహద్దులో సోమవారం ఉదయం జరి గింది. వివరాలు ఇలా ఉన్నాయి. రొంపిచెర్ల మండలం, పెద్దమల్లెల రైతు సేవాకేంద్రంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రాజకుమార్ పీలేరు నుంచి ద్విచక్ర వాహనంలో విధులకు బయలు దేరారు. పీలేరు మండలం, ఎర్రగుంటపల్లె సమీపంలోని స్సీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో వారు చికిత్స కోసం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి రాజకుమార్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. అయితే రాజకుమార్ వేలూరు సీఎంసీలో కోమాలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ద్రవిడ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ బాధ్యతల స్వీకరణ
కుప్పం: ద్రవిడ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా ఆచార్య ఎస్.సి.మల్లయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సెంట్రల్ యున్సివర్సిటీలో ఎకనామిక్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆయనను కుప్పం ద్రవిడ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాన్ని విద్య, పరిశోధన, పరిపాలన రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు. అనంతరం వర్సిటీలో ఉద్యోగులు ఆయనను కలసి శుభాంకాంక్షలు తెలిపారు.


