ఏం సాధించారు? | - | Sakshi
Sakshi News home page

ఏం సాధించారు?

Mar 17 2026 7:40 AM | Updated on Mar 17 2026 7:40 AM

చిత్తూరు అర్బన్‌: 2021 మునిసిపల్‌ ఎన్నికల్లో చిత్తూరు కార్పొరేషన్‌లో 50 డివిజన్లకు గాను 46 సీట్లను కై వశం చేసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. మేయర్‌ స్థానాన్ని సొంతం చేసుకుంది. మూడేళ్లకు పైగా వైఎస్సార్‌సీపీలో పదవులు అనుభవించిన వాళ్లు.. ఆపై కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. మరి ఆ కార్పొరేటర్ల భవిష్యత్తు..? మళ్లీ వైఎస్సార్‌సీలోకి రానిస్తారా..? పోనీ మధ్యలో వెళ్లినా.. టీడీపీ సీటు ఇస్తుందా..? మరి అప్పటి వరకు టీడీపీలో పనిచేసిన కార్యకర్తల పరిస్థితి..? ఏంటి..? ఒకరిద్దరు మినహా.. మిగిలిన కార్పొరేటర్లు వార్డులో పది మంది ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉన్నారా..? ఇలాంటి ఎన్నో సందేహాలు ప్రస్తుత తాజా మాజీ కార్పొరేటర్ల మది లో మెదలుతున్న ప్రశ్నలు. మంగళవారంతో పాలకవర్గం పదవీ కాలం ముగియనుండగా.. ప్రత్యేకాధికారిగా నియమితులైన కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పరి పాలన వ్యవహారాలపై బుధవారం నుంచి నిర్ణయాలు తీసుకోనున్నారు.

దూకేశారు

2024 మేలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో చిత్తూరు కార్పొరేషన్‌లోని పలువురు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదే ఏడాది జూలైలో ఏకంగా 24 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి దూకేశారు. అంటే దాదాపు 20 నెలలు టీడీపీలో ఉన్నారు. పార్టీ మారిన కార్పొరేటర్లలో కొందరిని ఏంసాధించారంటూ ‘సాక్షి’ ప్రశ్నిస్తే.. వారిలో బాధ తప్ప మరేం కనిపించ లేదు. ‘కష్టమో, నష్టమో ఒక్క పార్టీలో ఉండిపోయి ఉంటే బాగుణ్ణు.. ఇక్కడకు వచ్చి సాధించింది ఏమీలేదు..’ అని కొందరు, ‘ప్రజల కోసం వార్డులో నా లుగు పనులు చేయించుకున్నాం..’ అంటూ కొందరినిట్టూర్పు. ‘అసలు రానున్న మునిసిపల్‌ ఎన్నిక ల్లో నాకు టికెట్టు ఇస్తారనే నమ్మకం లేదు. అప్పటి వరకు వార్డు ఇన్‌చార్జ్‌గా ఉన్న వ్యక్తికే టీడీపీలో టికెట్టు ఇస్తారట, ఇటు ఉన్న పార్టీని వదిలేశాం, మధ్యలో చేర్చుకున్న పార్టీ వదిలేసింది..’ అంటూ ప్రజాప్రతినిధులు నిర్వేదం వ్యక్తం చేశారు.

అదో చరిత్ర

2021 మునిసిపల్‌ ఎన్నికల్లో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బ్రాండ్‌తో చిత్తూరు కార్పొరేషన్‌ కుర్చీని వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. ఏకంగా 37 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ తరఫున కార్పొరేటర్లు ఏకగ్రీవంగా గెలుపొందారు. 13 డివిజన్లలో ఎన్నికలు నిర్వహించగా అందులోనూ 9 స్థానాలను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుంది. టీడీపీ 3, స్వతంత్ర అభ్యర్థి ఓ చోట గెలిచారు. మొత్తంగా మేయర్‌తో కలిపి 46 డివిజన్లను ఓ ప్రాంతీయ పార్టీ గెలుచుకోవడం చిత్తూరు మునిసిపల్‌ చరిత్ర లో ఓ సరికొత్త అధ్యయనం సృష్టించింది.

మోదం–ఖేదం

పార్టీని వీడేటప్పుడు కొందరు కార్పొరేటర్లు వచ్చి వైఎస్సార్‌పీసీ ఇన్‌చార్జ్‌ విజయానందరెడ్డికి తమ మనసులో మాట చెబితే.. మరికొందరు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు. కానీ ఆయన నుంచి వచ్చిన సమాధాం ఒక్కటే.. ‘మీరు చిన్న పిల్లలు కాదు. ఎవరి వల్ల గెలిచారు..? ఆ పార్టీలోకి వెళితే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా..? ఏం చేస్తున్నారు..? అని ఆలోచించుకోండి. ఒక్కసారి వెళితే మళ్లీ పార్టీ ఆఫీస్‌ మెట్లు ఎక్కొద్దు.., మీ ఇష్టం’ అన్నారు. పార్టీ మారిన మేయర్‌తో సహా 24 మంది కార్పొరేటర్లను వైఎస్సార్‌సీపీ నుంచి సస్పెండ్‌ చేశారు. వారి స్థానంలో కొత్త వ్యక్తులను తయారు చేసుకుని, పార్టీని బలోపేతం చేసుకున్నారు. కానీ ఏకంగా 24 మందిని చేర్చుకున్న గురజాల జగన్‌మోహన్‌ నాయుడుకు మాత్రం మునిసిపల్‌ ఎన్నికల వేళ ఇబ్బందులు తప్పేలా లేవు. తాజా మాజీలకు సీట్లు ఇవ్వాలా..? అప్పటి వరకు జెండాలు మోసిన ఇన్‌చార్జ్‌లకు స్థానం కల్పించాలా? ఒకరికి సీటు ఇచ్చి, మరొకరికి ఇవ్వ కుంటే ఫిర్యాదులు, ఎంపీ చెప్పినవాళ్లు, పూతలపట్టు నియోజకవర్గంలోకి వచ్చే డివిజన్లు, జనసేన–బీజేపీ పొత్తు లాంటి అంశాలతో ఆయనకు ఖేదం తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement