పరీక్షల్లో అలసత్వం వహిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

పరీక్షల్లో అలసత్వం వహిస్తే చర్యలు

Mar 16 2026 7:45 AM | Updated on Mar 16 2026 7:45 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : పది పబ్లిక్‌ పరీక్షల పర్యవేక్షణకు రాష్ట్ర సమగ్రశిక్ష శాఖ మనబడి మన భవిష్యత్‌ శాఖ జేడీ మువ్వా రామలింగంను జిల్లా అబ్జర్వర్‌గా నియమించారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్రానికి విచ్చేశారు. జిల్లాలో పది పరీక్షల నిర్వహణపై క్షేత్రస్థాయి అధికారులతో వెబెక్స్‌ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోని ఏర్పాట్లను ఆరా తీశారు. పరీక్షల నిర్వహణలో అధికారులు, సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు ఉంటా యని హెచ్చరించారు. పది పరీక్షలు పూర్త య్యే వరకు ఆయన జిల్లాలో ఉంటూ పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించనున్నారు.

టెన్త్‌ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

చిత్తూరు అర్బన్‌ : పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సోమవారం నుంచి అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ఏఎస్పీ రాజశేఖర్‌ రాజు ప్రకటనలో తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎవ్వరూ గుంపులుగా ఉండడం చేయొద్దన్నారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాయడానికి తల్లిదండ్రులు సహకరించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్‌ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే డయల్‌–112కు సమాచారం ఇవ్వాలని కోరారు.

నో మొబైల్‌ జోన్లుగా

పరీక్ష కేంద్రాలు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో నేటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని జిల్లాకు విచ్చేసిన అబ్జర్వర్‌ మువ్వా రామలింగం వెల్లడించారు. ఆదివారం డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాస్‌ కాపీయింగ్‌కు తావు లేకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలను నో మొబైల్‌ జోన్‌లుగా ప్రకటించడం జరిగిందన్నారు.

అధికారులకు కూడా అనుమతి లేదు.....

పరీక్ష కేంద్రాల పరిధిలోకి విద్యార్థులు, ఇన్విజిలేటర్‌లు, ఇతర సిబ్బంది మొబైల్‌ ఫోన్‌లు తీసుకురావడాన్ని నిషేధించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి బయటి వ్యక్తులు వచ్చేందుకు అనుమతి లేదన్నారు. మీడియాకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదని తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, ఇతర అక్రమాలకు తావు లేకుండా పరీక్ష కేంద్రాలను నో మొబైల్‌ జోన్‌లుగా ప్రకటించారన్నారు. నిబంధనలను అతిక్రమించి మొబైల్‌ ఫోన్‌లతో పట్టుబడితే వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పరీక్షలను తనిఖీ చేసేందుకు ప్‌లైయింగ్‌ స్క్వాడ్‌లు, సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో డీఈవో రాజేంద్రప్రసాద్‌, పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ జయప్రకాష్‌నాయుడు, సూపరింటెండెంట్‌ స్వర్ణకుమారి, ఎంఈవోలు గణపతి, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement