చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో అనుమానాస్పద స్థితిలో చంద్రశేఖర్ (69) అనే వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. టూటౌన్ సీఐ నెట్టికంటయ్య కథనం మేరకు.. బంగారుపాళ్యం మండలం మొగిలిమిట్టూరుకు చెందిన చంద్రశేఖర్‌కు మానసిక సమస్యలున్నాయి. గతనెల హైదరాబాదులో ఉన్న తన కుమారు డు మురళి వద్దకు వెళ్లాడు. 24వ తేదీన హైదరాబాదు నుంచి చిత్తూరుకు రైలులో తన తండ్రిను మురళి ఒంటరిగా పంపించాడు. ఆ మరుసటిరోజు తన తండ్రి ఇంటికి వచ్చాడా..? అని ఆరాతీస్తే రాలేదని తెలిపారు. అప్పటి నుంచి చంద్రశేఖర్ కోసం అతని కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. శుక్రవారం మధ్యా హ్నం చిత్తూరు నగరంలోని పట్రాంపల్లె వద్ద ఓ వృద్ధుడు పొలాల్లో పడుంటే.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి జేబులో ఉన్న ఫోన్ నంబరుకు సంప్రదిస్తే మురళీ ఘటనా స్థలానికి వచ్చి చూసి, తన తండ్రి చంద్రశేఖర్‌గా గుర్తించాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కవయిత్రి మొల్లకు నివాళులు
చిత్తూరు అర్బన్: తెలుగు తొలి మహిళ కవయి త్రి ఆతుకూరి మొల్లకు చిత్తూరు పోలీసు శాఖ నివాళులర్పించింది. మొల్ల జయంతి సందర్భంగా శుక్రవారం చిత్తూరులోని పోలీసు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఏ ఆర్ ఏఎస్పీ దేవదాసు , డీఎస్పీ మహబూబ్ బాషా, ఆర్‌ఐ సుధాకర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
మైనార్టీ భవన నిర్మాణానికి కృషి
చిత్తూరు కలెక్టరేట్: త్వరలో మైనార్టీ భవనాన్ని నిర్మించడానికి స్థల సేకరణ కార్యక్రమం వేగవంతం చేయడానికి చర్యలు చేపడుతామని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంఽధీ పేర్కొన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ, జిల్లా యంత్రాంగం తరఫున శుక్రవారం ఇఫ్తార్ విందును ఇచ్చారు. కార్యక్రమాన్ని స్థానిక ఉర్దూషాదీ మందిర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్, ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, మాజీ నగర మేయర్ అముద పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. నగరంలో షాదిఖానా నిర్మించడానికి స్థల సేకరణ చేస్తామని తెలిపారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిన్నా రెడ్డి, ఈడీ మైనారిటీ ఆర్థిక సంస్థ హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు.


