చిత్తూరు (న్యాయవిభాగం): ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 34 బెంచ్‌లు ఏర్పాటు చేయగా చిత్తూరులో ఐదు బెంచ్ల ద్వారా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. లోక్ అదాలత్ విజయవంతానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు, బ్యాంకులు, బీమా సంస్థలు, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు సహకరించాలని కోరారు.
జాతీయ స్థాయి ఆదర్శ పంచాయతీగా నాయనూరు
కుప్పం: జాతీయ స్థాయిలో ఆదర్శ పంచాయతీగా కుప్పం మండలం నాయనూరు గ్రామ పంచాయతీ ఎంపికై ంది. దీనికి గాను కేంద్ర అధికార బృందం నాయనూరు పంచాయతీలో శుక్రవారం పర్యటించింది. గత ఐదేళ్ల క్రితం అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాయనూరును పంచాయతీ కేంద్రంగా విభజన చేసింది. స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ పంచాయతీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. దీంతో ఐదేళ్లలో పంచాయతీ అభివృద్ధి జాతీయ స్థాయిలో మెరిసింది. ఏప్రిల్‌లో అవార్డు ప్రదానం చేయనున్నట్టు అధికార బృందం పేర్కొంది.


