చిత్తూరు కార్పొరేషన్: వేసవిలో లోవోల్టే జీ సమస్యల నివారణకు ప్రతి మండలంలోనూ అధిక సామర్థ్యం కలిగిన అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటుచేయాలని ట్రాన్స్‌కో సీజీఎం కృష్ణారెడ్డి ఆదేశించా రు. ఆయన గురువారం ఎస్‌ఈ, రూరల్ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ వేసవి కారణంగా గ్రామా ల్లో విద్యుత్ వినియోగం పెరిగిందన్నా రు. దీంతో తరచూ వోల్టేజ్ సమస్య వస్తోందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు ఫెయి ల్యూర్స్‌తో విద్యుత్ అంతరాయం ఏర్ప డుతోందన్నారు. దాన్ని అధిగమించేందుకు 62 కేవీ ట్రాన్‌ఫార్మర్ల స్థానంలో 100 కేవీ, 100 కేవీ స్థానాల్లో 160 కేవీ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో కూడా అంతరాయం లేని విద్యుత్ అందించడమే లక్ష్యమన్నారు. వేసవిని ఎదుర్కొనేందుకు తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మ ద్, ఈఈ సురేష్, డీఈ శేషాద్రి పాల్గొన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మూడు రోజుల జైలుశిక్ష
చిత్తూరు అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన పలువురికి జరిమానాతోపాటు జైలు శిక్ష విధిస్తూ చిత్తూరులోని స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కె.పరిమళాదేవి గురువారం తీర్పు చెప్పారు. చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. నలుగురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున నలుగురికి రూ.40 వేలు జరిమానా, ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.


