గుడిపాల: ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన రైతులందరికీ నష్ట పరిహారం అందజేస్తామని జిల్లా వ్యవసాయాధికారి మురళి తెలిపారు. ఆయన గురువారం అటవీశాఖ, ఉద్యా నవనశాఖ అధికారులతో కలిసి ముత్తువాళ్లూ రు గ్రామంలో ఏనుగుల దాడుల్లో దెబ్బతిన్న మామిడి, అరటి, వరి పంటలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ దెబ్బతిన్న పంటల వివరాలతో నివేదికను కలెక్టర్‌కు అందజేసి రైతులను ఆదుకుంటామన్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, కచ్చితంగా నష్ట పరిహా రం వస్తుందన్నారు. కార్యక్రమంలో ఏడీఏ ఉమ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పట్టాభి, డీఆర్‌ఓ కరణ్‌సింగ్, ఎంపీపీ గోళ్ల హరిప్రసాద్, వ్యవసాయాధికారి సంగీత, ఉద్యానశాఖాధికారి ప్రవీ ణ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు డిల్లీరాణి, అరుణ తదితరులు పాల్గొన్నారు.


