చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నగరిలో ఈ నెల 17వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గుణశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కార్యాలయం సంయుక్తంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందులో 20కి పైగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ, బీటెక్, బీ ఫార్మసీ పూర్తి చేసి, 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. ఎంపికయ్యే వారి నైపుణ్యాన్ని బట్టి నెలకు రూ.13 వేల నుంచి రూ.30 వేల వరకు జీతం ఉంటుందన్నారు. హాజరయ్యే అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు, బయోడేటా తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. వివరాలకు రసూల్ 6300954441, నాగరత్నం 8520048041లో సంప్రదించాలన్నారు.
ఐరాల యువకుడికి
అంతర్జాతీయ గుర్తింపు
చిత్తూరు కలెక్టరేట్ : ఐరాల మండలం 45 కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పం చ్ బాలాజీ కుమారుడు హరీష్‌బాబుకు ప్రతిష్టాత్మకమైన యంగ్ సోషల్ ఇంపాక్ట్ చాంపియన్ బిరుదు లభించింది. హరీష్‌బాబు ప్రస్తుతం చిత్తూరులోని విజయం బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదు వుతున్నాడు. ఈ విద్యార్థి సామాజిక సేవా రంగంలో చేసిన కృషికి ఈ బిరుదు దక్కింది. ఇన్‌ఫూ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ 2026 మార్చి 8న ప్రపంచ రికార్డుల పుస్తకంలో హరీష్ పేరును అధికారికంగా నమోదు చేసింది. హరీష్ బాబు చిన్న వయస్సులోనే సామాజిక బాధ్యతతో మెలిగి, ప్రపంచ స్థాయి రికార్డు సాధించడంపై ఐరాల మండల వాసులతోపాటు విజయం విద్యాసంస్థల చైర్మన్ తేజోమూర్తి, బిజినెస్ స్కూల్ అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
నైపుణ్యాభివృద్ధిపై
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు నైపుణ్యాబివృద్ధిపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో భాగంగా నెల్లూరు ప్రాజెక్ట్ పరిధిలో ఐటీడీపీ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు తెలిపా రు. డేటా ఎంట్రీ ఆపరేటర్, లైట్ వెహికల్ డ్రైవింగ్, జూట్ బ్యాగ్ మేకింగ్, మగ్గం, ఎంబ్రాయిడరీ వర్క్, టైలరింగ్ తదితర కోర్సులకు శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. శిక్షణా కాలం 45 నుంచి 60 రోజులు ఉంటుందని, అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తారన్నారు. ఎంపికయ్యే అభ్యర్థులు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఉన్న యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాల కు సెంటర్ మేనేజర్ బాలాజీని 8187899877లో సంప్రదించాలన్నారు.
నేడు ప్రభుత్వ ఇఫ్తార్ విందు
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరులోని అగ్నిమాపక శాఖ కార్యాలయం సమీపంలో ఉన్న ఉర్దూ షాదీమహల్ వద్ద శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ప్రభుత్వ ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి తెలిపారు. ఆయన గురువా రం విలేకరులతో మాట్లాడుతూ రంజాన్ మాసా న్ని పురస్కరించుకుని ముస్లింలకు ప్రభుత్వం తరఫున కలెక్టర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు పాల్గొనాలని కోరారు.


