కుప్పం: కుప్పం పోలీసు డివిజన్ పరిధిలో నాలుగు మండలాల పోలీసు స్టేషన్ పరిధిలోని పనిచేస్తున్న 32 మంది సిబ్బందిని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. కుప్పం అర్బన్ పోలీసు స్టేషన్ పనిచేస్తున్న 10 మంది కానిస్టేబుల్స్‌ను ఒకే సారి బదిలీ చేశారు. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పనిచేయని వారిని సైతం ఈ బదిలీల్లో నియోజకవర్గం నుంచి ఇతర పోలీసు స్టేషన్లకు పంపారు. 32 మంది ఒకే సారి బదిలీ కావడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. గుడుపల్లె మండలం ఎస్‌ఐగా పనిచేస్తున్న శ్రీనివాసులు అకస్మాత్తుగా బదిలీ అయ్యారు. గత రెండు నెలలుగా ఆ పోస్టు భర్తీ కాలేదు.
నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్
చిత్తూరు కలెక్టరేట్: ప్రజల సమస్యల పరిష్కా రం కోసం సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిధుల దుర్వినియోగం!
సాక్షి, టాస్క్‌ఫోర్స్: జిల్లాలోని వైద్యఆరోగ్య శాఖ కార్యాలయంలో చేపట్టిన ఆధునికీకరణ పనులపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎంహెచ్‌ఓ చాంబర్, సీసీ చాంబర్, సమావేశ మందిరం ఆధునికీకరణ పేరుతో దాదాపు రూ.29 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే ఏ పనైనా రూ.5 లక్షలు దాటితే తప్పనిసరిగా టెండర్ పిలవాల్సి ఉంది. నిబంధనలను తప్పించుకునేందుకు పనులను ఆరు ముక్కలుగా విభజించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో పనిని రూ.4.99 లక్షల చొప్పున చూపిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు చేపట్టినట్లు సమాచారం. డీఎంహెచ్‌ఓ చాంబర్‌కే రూ.15 లక్షలు ఖర్చు చేస్తున్నారు. మిగిలిన రెండు గదుల పనులకు మరో రూ.14 లక్షల వరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఈ పనులకు సంబంధించిన నిధులు ఇప్పటికే కాంట్రాక్టర్ ఖాతాకు జమ అయ్యాయి. అయితే వైద్య పరికరాలు, మందులు, మాత్రలు, ప్రజలకు అవసరమైన వైద్య సేవల కోసం వినియోగించాల్సిన ఎన్‌హెచ్‌ఎం నిధులను ఇలా కార్యాలయ గదుల అలంకరణకు మళ్లించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
నేడు డయల్ యువర్ ఎస్‌ఈ
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయ ల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మ ద్ తెలిపారు. సమస్యలపై వినియోగదారులు ఉద యం 8.30–9.30 గంటల మధ్య 79931 47979 నంబర్‌కు ఫోన్ చేయాలని వివరించారు.
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల
సమస్యల పరిష్కారానికి కృషి
చిత్తూరు కలెక్టరేట్: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినాయకం తెలి పారు. ఆదివారం కణ్ణన్ ప్రభుత్వ పాఠశాలలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 14 వ తేదీన అంబేడ్కర్ జయంతి వేడుకలు గ్రామీణ స్థాయిలో ఘనంగా నిర్వహించాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తరఫున ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగ రీత్యా ఎలాంటి సమస్యలు ఎదురైనా, అలాగే ఉద్యోగోన్నతుల విషయంలో రిజర్వేషన్లు పాటించకపోయినా వెంటనే సంఘం దృష్టికి తీసుకురావాలని తెలిపారు. వాటి పరిష్కారానికి సంఘం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.భాస్కర్, అసోసియేట్ అధ్యక్షుడు వినాయకం, అదనపు కార్యదర్శి సంతానం, జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్, నవీన్, రాజా, నరే ష్, దేవరాజులు పాల్గొన్నారు.


