బాబు పాలనలో మృత్యుఘోష | - | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో మృత్యుఘోష

Mar 9 2026 7:26 AM | Updated on Mar 9 2026 7:26 AM

● మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

పాలసముద్రం: రాష్ట్రంలో రెండేళ్ల చంద్రబాబు పరిపాలన అధ్వానంగా తయారైందని, కల్తీ పాలు తాగి అమాయకులు చనిపోయారని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు. ఆదివారం క్రిష్ణజమ్మపురంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ పాలు తాగి జనం చనిపోవడానికి బాబు అసమర్థ పాలనే కారణమ న్నారు. శ్రీకాకుళంలో తాగునీరు కలుషితమై ఇద్దరు చనిపోయారని, 70 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. టీడీపీ పాలన మృత్యుఘోషగా మారిందన్నారు. ఇప్పటికే తిరుమల లడ్డూ వివాదంలో చంద్రబాబునాయుడు ప్రభు త్వం బొక్కబోర్లా పడిందన్నారు. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ప్రజలు ఉన్నారని, అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ అసెంబ్లీలో కులం, మతం, దేవుడి గురించి మా ట్లాడుతూ ప్రజాసమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. మాజీ మండల కన్వీనర్‌ సుబ్రమణ్యరెడ్డి, పద్మనాథనాయుడు, సుబ్రమణ్యంరెడ్డి, ఆముదాల సర్పంచ్‌ అనురేఖమదివానన్‌, రవిరెడ్డి, షణ్ముగరెడ్డి, క్రిష్ణయ్య, వేణు, కుప్పారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement