మహిళా సాధికారతతో సమాజ వికాసం | - | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారతతో సమాజ వికాసం

Mar 9 2026 7:26 AM | Updated on Mar 9 2026 7:26 AM

● ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

చిత్తూరు కలెక్టరేట్‌: మహిళా సాధికారతతోనే సమాజ వికాసం లభిస్తుందని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ అన్నారు. ఆదివారం నాగయ్యకళాక్షేత్రంలో ఐసీడీఎస్‌, డీఆర్‌డీఏ, మెప్మా, జిల్లా మహిళా సమాఖ్య శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళలు మనోధైర్యంతోజీవించాలన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌ మహిళలకు ఆర్థిక చేయూత చెక్కులు, యంత్ర పరికరాలను పంపిణీ చేశారు. మేయర్‌ అముద, డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ భారతి, చుడా చైర్‌పర్సన్‌ కఠారి హేమలత, ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, జిల్లా సీ్త్ర సంక్షేమ శాఖ చైర్మన్‌ భారతి, పీడీలు శ్రీదేవి, వెంకటేశ్వరి, రవీంద్ర పాల్గొన్నారు.

జిల్లా పరిషత్‌ కార్యాలయంలో..

జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జిల్లా సీ్త్ర సంక్షేమ శాఖ చైర్మన్‌ భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడారు. మహిళా సాధికారతే నిజమైన పురోగతి అని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా సీ్త్ర సంక్షేమ శాఖ చైర్మన్‌ భారతి జెడ్పీలోని మహిళా ఉద్యోగులకు చీరలు పంపిణీ చేశారు. జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు, ఉద్యోగులు పాల్గొన్నారు.

జెడ్పీలో మహిళా ఉద్యోగులకు చీరలు పంపిణీ

మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement