వార్డెన్లు పద్ధతి మార్చుకోవాలబ్బా! | - | Sakshi
Sakshi News home page

వార్డెన్లు పద్ధతి మార్చుకోవాలబ్బా!

Mar 9 2026 7:26 AM | Updated on Mar 9 2026 7:26 AM

● మెనూ అమలు బాగోలేదని మీ పిల్లలే అంటున్నారు.. ● అసలే వీళ్లంతా పేదపిల్లలు కదా అర్థం చేసుకోండి సామీ ● ఏపీ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయప్రతాప్‌రెడ్డి

పలమనేరు: ‘హాస్టల్‌లో ఉన్నవాళ్లంతా పేద పిల్లలు. వారికి సేవ చేసి మంచి భవిష్యత్తును అందించాలిగానీ.. ఇంత నిర్లక్ష్యం చేస్తే ఎట్టా? ముఖ్యంగా వార్డెన్లు పద్ధతి మార్చుకోవాలబ్బా. లేకుంటే చర్య లు తప్పవు, మీపై ఏమైనా యాక్షన్‌ తీసుకుంటే మళ్లీ రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ రాక మళ్లీ నన్ను తిట్టుకుంటారు. ఇవన్నీ అవసరమా’ అంటూ ఏపీ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ వియప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఆదివారం ఆయన పట్ట ణంలోని బీసీ, ఎస్సీ హాస్టళ్లను తనిఖీ చేశారు. పిల్లలతో ప్రత్యేకంగా మాట్లాడి వారి ద్వారా చీటీలు రాసి అందులో వారు రాసిన ఫిర్యాదుల ఆధారంగా విచారించారు. మదనపల్లెలో ఐదారు హాస్టళ్లను చూశానని, అవి బాగున్నాయని, ఇక్కడ మాత్రం పరిస్థితి బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎస్సీ–1 హాస్టల్‌పై ఎక్కువగా సమస్యలున్నట్టు తెలుస్తోందన్నారు. సంబంధిత ప్రజాప్రతినిధులు తరచూ హాస్టళ్లను తనిఖీ చేస్తే బాగుంటుందన్నారు. ఇప్పటికై నా వార్డెన్లు మారాలని సూచించారు. హాస్టళ్లలో ఏదైనా సమస్యలుంటే తమశాఖ వాట్సాప్‌ నం.9490551117కు వీడియోలు తీసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement