నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్‌డే | - | Sakshi
Sakshi News home page

నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్‌డే

Mar 9 2026 7:26 AM | Updated on Mar 9 2026 7:26 AM

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలోని వన్‌టౌన్‌ పక్కన ఉన్న ఆర్మ్‌డ్‌ రిజర్వు(ఏఆర్‌) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్‌ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు.

నేడు జిల్లా సమీక్ష కమిటీ సమావేశం

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై సమీక్షించేందుకు ఈ నెల 9 వ తేదీ కలెక్టరేట్‌లో జిల్లా సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్‌లోని వివేకానంద భవన్‌ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షకు ఇన్‌చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ముఖ్య అతిథిగా పా ల్గొంటారన్నారు. సమీక్షలో జెడ్పీ నిధులు, తాగునీటి సరఫరా, ఇంజినీరింగ్‌ శాఖల పనితీరు, ఉపాధి హామీ పథకం, రెవెన్యూ అంశాలు, వ్యవసాయం, అనుబంధ శాఖలు, వైద్యం, విద్యాశాఖల పురోగతిపై చర్చిస్తామ ని తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు తమ శాఖలకు సంబంధించిన సమగ్ర నివేదికలతో సమావేశానికి హాజరు కావాలని కలెక్టర్‌ ఆదేశించారు.

నిత్యాన్నదానానికి

రూ.10 లక్షల విరాళం

కాణిపాకం: కాణిపాకంలోని స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో ఆదివారం ఓ దాత నిత్య అన్నదానం ట్రస్ట్‌కి విరాళం అందజేశారు. బెంగళూరుకు చెందిన అచ్చయ్‌ గోపీనాథ్‌ కుటుంబ సభ్యులతో కలిసి రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో దాతలకు స్వామివారి దర్శనం ఏర్పాటుచేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఏఈఓ రవీంద్రబా బు, సూపరింటెండెంట్‌ వాసు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి, బాలాజీనాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement