న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2026
శతాబ్దాలుగా వంటింటి కుందేళ్లంటూ అణచివేతకు గురయ్యారు.
సతీసహగమనం వంటి దురాచారాలకు బలయ్యారు. కట్టుబాట్ల నడుమ దిక్కుతోచక కొట్టుమిట్టాడారు. సంప్రదాయాల కింద నలిగిపోయారు. వివక్షతో
విసిగివేసారిపోయారు. చివరకు నిద్ర లేచింది మహిళాలోకం అంటూ జూలు విదిల్చారు. ఆత్మవిశ్వాసంతో ఆధిపత్య
శృంఖలాలను తెంచుకున్నారు. మనోధైర్యంతో ముందడుగు వేశారు. అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఆకాశంలో సగమని నిరూపించుకుంటున్నారు. పురుషులకు దీటుగా సత్తా చాటుతున్నారు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ అంతరిక్షం వరక విజయపతాకం ఎగురవేస్తున్నారు. ఆధునిక సమాజంలో అత్యుత్తమంగా ఎదుగుతున్నారు.
ఇఫ్తార్ సహర్
ఆదివారం (సా) సోమవారం (ఉ)
చిత్తూరు 6–28 5–05
చిత్తూరు అర్బన్: మహిళలకు ఎందులోనూ తక్కువ కాదని, ప్రధానంగా రాజకీయాల్లో పురుషులకు సమానంగా ఆడపడుచులకు పాలన హక్కు ఉండాల్సిందేనంటూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భావించారు. ఆలస్యం అమృతం విషం అన్నట్టు 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేశారు. ఫలితంగా జిల్లాలోని పురపాలనలో ఆమె ఆధిపత్యానికి శ్రీకారం చుట్టారు. అడవిలో కట్టెలు కొట్టుకుని తీసుకువచ్చి, వాటిని అమ్మితే తప్ప జీవనం గడవని ఓ సాధారణ మహిళ అముదను చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్‌గా కూర్చోబెట్టారు. చిత్తూరులోని 25 మంది మహిళలను కార్పొరేటర్లుగా గెలిపించారు. ఉమ్మడి జిల్లాలోని పుంగనూరులో 31 వార్డులకు గానూ 17 స్థానాలను అతివలకే అప్పగించారు. ఇక పలమనేరులో 13, పుత్తూరులో 16, నగరిలో 14 వార్డుల్లో ఆమెకు పట్టం కట్టారు. తిరుపతి కార్పొరేషన్‌లో సైతం 24 మంది ఆడపడుచులకు కార్పొరేటర్లుగా పదవులు కట్టబెట్టారు. బీసీ మహిళ శిరీషకు తిరునగర ప్రథమ పౌరురాలి గౌరవం కల్పించారు.


