చిత్తూరు కలెక్టరేట్ : జిల్లావ్యాప్తంగా మే 1వ తేదీ నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ అధికారులు పకడ్బందీగా కసరత్తు చేపట్టారు. జనగణన నిర్వ హణపై క్షేత్రస్థాయిలో ఆర్‌డీఓలు, తహసీల్దా ర్లు, ఎంపీడీఓలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. తొలిదశలో ఆర్‌డీఓ, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఎంపీడీఓలకు శిక్షణ ఉండనుంది. జిల్లాలో చేపట్టే జనగణన డిజిట ల్ విధానంలోనే కొనసాగుతుందని కలెక్టరేట్ అధికారులు వెల్లడిన్నారు. ఈ ప్రక్రియకు అధు నాతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చారు. భవనాలను గుర్తించి సంఖ్య కేటాయించి యాప్‌లో వివరాలు అప్‌లోడ్ చేసేలా చర్య లు చేపడుతున్నారు.
ఆన్‌లైన్‌లో ‘పది’ హాల్ టికెట్లు
చిత్తూరు కలెక్టరేట్ : పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థుల హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఈ నెల 16 వ తేదీ నుంచి పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యార్థులు తమ హాల్ టికెట్లను మొబైల్ ఫోన్ నుంచే డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ క్రమంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో 9552300009 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేయాలి. అనంతరం కొన్ని రకాల సేవ లు స్క్రీన్ పై కనిపిస్తాయి. అందులో విద్యాసేవలను ఎంపిక చేసుకోవాలి. తర్వాత హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ఆప్ష న ఎంచుకోవాలి. పుట్టిన తేదీ, అడ్మిషన్ నంబర్, పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పీఈఎన్)లలో ఏదో ఒకటి నమోదు చేస్తే హాల్ టికెట్ డౌన్‌లోడ్ అవుతుంది. అలాగే బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో సైతం హాల్‌టికెట్ పొందవచ్చని విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
గుడ్లగూబకు చికిత్స
చిత్తూరు కార్పొరేషన్ : అనారోగ్యంతో కిందపడిన గుడ్లగూబకు అటవీశాఖ అధికారులు చికి త్స చేయించారు. శనివారం చిత్తూరు మురకంబట్టు సర్కిల్ సమీపంలో గుడ్లగూబ పడి ఉండగా విశ్రాంత ఏఎస్‌ఐ రాజేంద్ర గుర్తించారు. ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు వెళ్లి గుడ్లగూబకు ఇంజెక్షన్ వేయించినట్లు ఎఫ్‌బీఓ రెడ్డెప్ప తెలిపారు.


