గ్యాస్‌ పైప్‌లైన్‌తో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ పైప్‌లైన్‌తో అప్రమత్తంగా ఉండాలి

Feb 27 2026 7:34 AM | Updated on Feb 27 2026 7:34 AM

గ్యాస

గ్యాస్‌ పైప్‌లైన్‌తో అప్రమత్తంగా ఉండాలి

పాలసముద్రం : చైన్నె నుంచి బెంగళూరుకు వెళ్తున్న గ్యాస్‌, పెట్రోల్‌ పైప్‌లైన్‌తో రైతులు, సమీపంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఓసీఎల్‌ సీనియర్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ నారాయణన్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఇన్‌న్పెక్టర్‌ హర్షవర్దన్‌ తెలిపారు. గురువారం ఆముదాల సమీపంలో ఐఓసీఎల్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో కలసి పైప్‌లో గ్యాస్‌, పెట్రోల్‌ లీకై తే ఎలాంటి ఆపదలు వస్తాయి.. ఎలా కాపాడుతారనే దానిపై డెమో చేసి చూపించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నగరి ఆర్డీఓ అనుపమ మాట్లాడుతూ పాలసముద్రం మండలంలో సుమారు 30 కి.మీ మేర పైప్‌లైన్‌ వెళ్తుందని, సమీపంలోని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పైప్‌లైన్‌ లీకేజీ అవుతున్న ప్రదేశం నుంచి 200 మీటర్లు దూరంగా ఉండాలన్నారు. జీడీ నెల్లూరు సీఐ ప్రసాద్‌, పీహెచ్‌సీ డాక్టర్‌ మోహన్‌క్రిష్ణ, తహసీల్దార్‌ గుర్రప్ప, సర్పంచ్‌ అనురేఖ, ఎంపీటీసీ లిఖిత, సూపర్‌వైజర్‌ అన్నాదొరై, శేఖర్‌ పాల్గొన్నారు.

గ్యాస్‌, పెట్రోల్‌ లీకేజీపై మాట్లాడుతున్న సీనియర్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ నారాయణన్‌

డెమో ద్వారా అవగాహన కల్పిస్తున్న అధికారులు

గ్యాస్‌ పైప్‌లైన్‌తో అప్రమత్తంగా ఉండాలి 1
1/2

గ్యాస్‌ పైప్‌లైన్‌తో అప్రమత్తంగా ఉండాలి

గ్యాస్‌ పైప్‌లైన్‌తో అప్రమత్తంగా ఉండాలి 2
2/2

గ్యాస్‌ పైప్‌లైన్‌తో అప్రమత్తంగా ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement