మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యం
పిల్లలకు మాత్రం పోలీస్ ఒక స్నేహితుడే ఎస్పీ తుషార్‌డూడి
పాలసముద్రం : పోలీసు అంటే తప్పు చేసిన వారికి భయం ఉండాలి.. పిల్లలకు మాత్రం పోలీసు ఒక స్నేహితుడిగా ఉండాలి అని జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఏఎస్పీ తరుణ్ పహ్వ తెలిపారు. గురువారం బలిజకండ్రిగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సీఐ హనుమంతప్ప, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో జరిగిన ధైర్య స్పర్శ కార్యక్రమానికి విచ్చేసి.. ధైర్య స్పర్శ పోస్టర్‌ని అవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ నేటితరం యువతలో కొందరు మత్తుకు బనిసవుతున్నారన్నారు. గంజాయి.. మాదక ద్రవ్యాలు.. నిషేధిత డ్రగ్స్, మద్యం వంటి వాటికి బానిసగా మారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని చెప్పారు. ఏఎస్పీ తురణ్ పహ్వ మాట్లాడుతూ సాఫ్ట్ డ్రింక్ అలవాటు ద్వారా కూడా చిన్నపిల్లల్లో షుగర్ వ్యాప్తిస్తోంద న్నారు. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే కష్టాలు, రోడ్డు ప్రమాదాలు, బాల్యవివాహాలు వంటి వాటిపై అవగాహన కల్పించారు. అనంతరం మాదక ద్రవ్యాలు.. వా టి వల్ల కలిగే అనర్థాలపై నిర్వహించిన పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌బీ సీఐ మురళీమోహన్, క్రైమ్ సీఐ ఉమామహేశ్వరరావు, జీడీ నెల్లూరు సీఐ ప్ర సాద్, ఎస్‌ఆర్‌పురం ఎస్‌ఐ సుమన్, ఎంఈఓలు రాజేంద్రప్రసాద్, గిరిజ, హెచ్‌ఎం హరిత పాల్గొన్నారు.
విద్యార్థులతో జిల్లా ఎస్పీ తూషార్ డూడి
ధైర్య స్పర్శ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎస్పీ తుషార్ డూడి
పోలీసులంటే తప్పు చేసే వారు భయపడాలి
మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యం


