దాడులు చేయడమేనా రూల్‌ ఆఫ్‌లా ? | - | Sakshi
Sakshi News home page

దాడులు చేయడమేనా రూల్‌ ఆఫ్‌లా ?

Feb 3 2026 7:34 AM | Updated on Feb 3 2026 7:34 AM

దాడులు చేయడమేనా  రూల్‌ ఆఫ్‌లా ?

దాడులు చేయడమేనా రూల్‌ ఆఫ్‌లా ?

– మాజీ మంత్రి ఆర్కేరోజా

నగరి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై దాడులు చేయడమేనా రూల్‌ ఆఫ్‌ లా అంటే అని మాజీ మంత్రి ఆర్కేరోజా ప్రశ్నించారు. సోమవారం నగరిలో ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ నాయకులపై వరుసకట్టి దాడులు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలనను తలపిస్తోందన్నారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారని, జోగిరమేష్‌, వలభనేని వంశీ, కొడాలి నాని, పెర్ని నాని, ముద్రగడ, నల్లపురెడ్డి ప్రశన్నకుమార్‌ రెడ్డి, కామిరెడ్డి నాని, కేతిరెడ్డి పెద్దారెడ్డి, అబ్బయ చౌదరి, భూమన కరుణాకరరెడ్డి, రెడ్డెప్ప ఇళ్లపై దాడిచేశారన్నారు. విడదల రజని, దాడిశెట్టి రాజాపైన, ఉప్పల హారిక, ఉప్పల రాము, దేవినేని అవినాష్‌, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌పై ప్రత్యక్ష దాడికి యత్నించారన్నారు. హిందూపుర్‌ వైసీపీ కార్యాలయంపైన, మార్గాని భరత్‌ కార్యాలయంపైన, నంబూరి శంకర్‌రావు కార్యాలయాలపై దాడి చేశారన్నారు. తనపై ఆర్పీని పెట్టి బూతుల దాడి చేయిస్తున్నారని చెప్పారు. డెక్కన్‌ క్రానికల్‌ ఆఫీస్‌ పైన, సాక్షి కార్యాలయం పై కూడా దాడి చేశారన్నారు. ఇలా వరసకట్టి దాడులు చేయడమేనా చంద్రబాబు మీరంటున్న శ్రీరూల్‌ ఆఫ్‌ లాశ్రీ ఈ రాష్ట్రంలో? అని ఆమె ప్రశ్నించారు. ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తున్నారని, వీటన్నింటికీ జవాబు చెప్పే రోజు త్వరలోనే ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement