ఎన్నిసార్లు పిలిచినా.. | - | Sakshi
Sakshi News home page

ఎన్నిసార్లు పిలిచినా..

Feb 3 2026 7:34 AM | Updated on Feb 3 2026 7:34 AM

ఎన్నిసార్లు పిలిచినా..

ఎన్నిసార్లు పిలిచినా..

● 5వ డివిజన్‌లోని కామేశ్వర్‌ నగర–సాంబయ్యకండ్రిగ మధ్య రూ.2.4 లక్షల వ్యయంతో మురుగునీటి కాలువ నిర్మాణానికి మూడుమార్లు టెండర్లు పిలిచినా ఏ ఒక్కరూ పాల్గొనలేదు. ● 5వ డివిజన్‌ జయలక్ష్మినగర్‌–సాంబయ్యకండ్రిగ వద్ద కాలువ నిర్మాణానికి రూ.2.14 లక్షలు, జమాత్‌ తోపు–సాంబయ్యకండ్రిగ వద్ద రూ.8.52 లక్షల వ్యయంతో కాలువ నిర్మాణానికి రెండు మార్లు టెండర్లు పిలిచినా ఫలితం లేదు. ● 46వ డివిజన్‌లోని పట్రాంపల్లెలో నీటి సరఫరా కోసం రూ.4.25 లక్షలతో పీవీసీ పైపులు, జీఐ పైపులు సరఫరా చేయాలని రెండు సార్లు టెండరు పిలిస్తే అతీగతీ లేదు. ● 1–15 డివిజన్ల లో రోడ్లపై గుంతలు పూడ్చడానికి రూ.3 లక్షలు, 16–33 డివిజన్ల మధ్య గుంతలు పూడ్చడానికి రూ.2.55 లక్షలు, 34–50 డివిజన్ల మధ్య రోడ్ల రిపేర్లకు రూ.4.75 లక్షలతో ఆన్‌లైన్‌ టెండర్లు పిలిచినా స్పందన అంతంత మాత్రమే.

నచ్చితే పనులు చేస్తాం.. లేకుంటే లేదు రూ.30 లక్షలు దాటితే సరి.. తక్కువైతే? అభివృద్ధి పనుల టెండర్ల వాయిదాల పర్వం చిత్తూరు కార్పొరేషన్‌లో కాంట్రాక్టర్ల విచిత్ర పోకడ

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాల్లో మౌలిక వసతులు–సదుపాయాలు లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల రూ.2 లక్షల వ్యయంతో కాలువలు పూర్తిచేస్తే సమస్య పరిష్కారమవుతుంది. మరికొన్ని చోట్ల రూ.3 లక్షలతో రోడ్డు వేస్తే అక్కడి ప్రజల ఆనందానికి అవధులు ఉండవు. ఈ పనులను పూర్తి చేయడానికి నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌ టెండర్లు పిలవడం, వచ్చిన దరఖాస్తుల్లో నిర్ణయించిన ధర కంటే తక్కువ మొత్తం కోట్‌ చేసిన వాళ్లకు పనులను అప్పగించి, వాటిని సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంటుంది. ఇందులో భాగంగానే నగరంలోని పలు ప్రాంతాల్లో చిన్నపాటి కాలువలు, రోడ్లు వేయడం.. పారిశుద్ధ్య నిర్వహణకు చీపుర్లు, గడ్డపార, ఇతర పనిముట్లు, రోడ్లపై గుంతలు పూడ్చడానికి అధికారులు టెండర్లు పిలిచారు. ఇప్పటికే రెండు సార్లకుపైగా టెండర్లు పిలిచినా, ఒక్కరు కూడా దరఖాస్తు వేయలేదు. గత నెల 21న జారీ చేసిన టెండర్‌ నోటిఫికేషన్‌లో రూ.55.39 లక్షల విలువ చేసే పలు పనులను చేయడానికి అధికారులు నోటిఫికేషన్‌ ఇస్తే, సోమవారం గడువు ముగిసింది. చాలా పనులకు ఒక్క టెండరు కూడా పడలేదు.

చేయిస్తాం..

కొన్ని పనులకు రెండు, మూడు సార్లు టెండర్లు పిలిచినా దరఖాస్తులు పడలేదు. ఫలితంగా చిన్న చిన్న పనులు చేయించడం కాస్త ఇబ్బందికరంగా మారుతోంది. కాంట్రాక్టర్లను పిలిపించి ఓసారి మాట్లాడుతాం. త్వరలోనే అన్ని పనులు పూర్తిచేయిస్తాం.

– వెంకటరామిరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు, చిత్తూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement