నేడు కరెంటోళ్ల జనబాట | - | Sakshi
Sakshi News home page

నేడు కరెంటోళ్ల జనబాట

Feb 3 2026 7:34 AM | Updated on Feb 3 2026 7:34 AM

నేడు

నేడు కరెంటోళ్ల జనబాట

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్‌ తెలిపారు. జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమో దు చేసుకుంటారని చెప్పారు. వాటిని దశలవారీగా పరిష్కారించనున్నట్లు పేర్కొన్నారు.

జేఏసీ కో–చైర్మన్‌గా ఉదయ్‌కుమార్‌

చిత్తూరు అర్బన్‌: ఏపీ జాయింట్‌ యాక్షన్‌ కమి టీ (జేఏసీ) జిల్లా కో–చైర్మన్‌గా చిత్తూరు పోలీసు సంక్షేమ సంఘం నుంచి ఉదయ్‌కుమార్‌ ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా సయ్యద్‌ మరూఫ్‌ హుస్సేన్‌ను ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు పోలీసు అసోసియేషన్‌ బలోపేతానికి కృషి చేస్తానని ఉదయ్‌కుమార్‌ తెలిపారు.

పోలీస్‌ స్టేషన్లలోనే పరిష్కారమవ్వాలి

చిత్తూరు అర్బన్‌: న్యాయం కోసం స్టేషన్‌ కోసం వచ్చే బాధితులకు.. పోలీస్‌ స్టేషన్‌లోనే సమస్యలు పరిష్కారం చూపాలని చిత్తూరు ఎస్పీ తుషార్‌డూడీ ఆదేశించారు. చిత్తూరు నగరంలోని ఏఆర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ఎస్పీ తుషార్‌ డూడీ ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. మొత్తం 47 వినతులు అందగా.. వాటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్‌ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. చాలావరకు సమస్యలు స్టేషన్లలో పరిష్కారం లభించకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడకు వస్తున్నారన్నారు. ఇదిలావుండగా చిత్తూరు ఏఎస్పీ రాజశేఖరరాజు, డీటీసీ డీఎస్పీ రాంబాబు సైతం ఫిర్యాదులు తీసుకున్నారు.

హుండీ లెక్కింపు వాయిదా

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీ లెక్కింపును ఈనెల 6వ తేదీకి వాయిదా వేసినట్టు ఈవో పెంచలకిషోర్‌ తెలిపారు. తొలుత బుధవారం లెక్కించనున్నట్లు ప్రకటించామన్నారు. తర్వా త అనివార్య కారణాలతో ఈనెల 6కు వాయి దా వేశామన్నారు. ఆస్థాన మండపంలో ఉద యం 7 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు.

ఎన్నికలు రేపు

చిత్తూరు కార్పొరేషన్‌: ఉమ్మడి జిల్లాలోని గుడిపాల, బి.కొత్తకోట మండల పరిషత్‌ అధ్యక్ష పదవులకు బుధవారం ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఆయా మండలాల్లో ఎంపీపీలను, ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకోనున్నారు. గుడిపాల, బి. కొత్తకోట ఎంపీపీలు ప్రసాద్‌రెడ్డి, లక్ష్మినరసింహులు అవిశ్వాస తీర్మానం ద్వారా పదవులు కోల్పోయారు. ఆ పదవుల భర్తీకి ఎన్నిక నిర్వహించేందుకు జెడ్పీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు.

నేడు కరెంటోళ్ల జనబాట 
1
1/1

నేడు కరెంటోళ్ల జనబాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement