● కూలుస్తూ..తొలగిస్తూ!
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ముందస్తు నోటీసులు ఇచ్చిన విగ్రహాలు, ఆలయాలతో పాటు పలు కట్టడాల తొలగింపును గురువారం నుంచి అధికారులు ప్రారంభించారు. తహసీల్దార్ రవికుమార్, సీఐ మల్లికార్జున్, జాతీయ రహదారి అధికారులు పోలీసు బలగాలతో ఉదయం నుంచే తొలగింపు పనులు ప్రారంభించారు. నేత్రదేవత ఆలయ ఆర్చి, కాకవేడు కూడలి వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం, ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రహరీగోడ, వీకేఆర్ పురం వద్ద గల ఓంశక్తి ఆలయ ప్రహరీ, నత్తం కండ్రి వద్ద గల శక్తి ఆలయ ప్రహరీలు, బస్ షెల్టర్లను ప్రొకై ్లన్లు, హిటాచీలు, క్రేన్‌ల సాయంతో తొలగించేశారు. కీళపట్టు వద్ద ఉన్న ఆంజేయ స్వామి ఆలయ తొలగింపులో నిర్వాహకులు ఆలయంలోని వస్తువులు పూర్తిగా తీసుకోలేదని, నాలుగు రోజులు సమయం ఇవ్వాలని, భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అలాగే పెకళించి మరో ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటామని తహసీల్దార్‌కు విన్నవించుకున్నారు. దీంతో వారికి నాలుగు రోజుల సమయం కేటాయించారు. మిగిలిన నిర్మాణాల తొలగింపును జాతీయరహదారి అధికారులు చకచకా కానిచ్చేశారు.
– నగరి


