నా ప్రాణం పోయినా.. పది మందీ బతకాలి!
● శ్రీనివాస్‌రెడ్డి అవయవదానం ● పలువురికి పునర్జన్మ
వి.కోట: ‘నా ప్రాణం పోయినా పది మందీ బతకాలి’ అన్న దృఢ సంకల్పంతో ముందుకెళ్లాడు. అందుకే బ్రెయిన్ డెడ్ అయ్యి మృత్యుఒడికి చేరినా.. ఆయన కుటుంబ సభ్యులు తన అడుగు జాడల్లోనే నడిచి పదుగురికి పునర్జన్మనిచ్చారు. వివరాలు.. మండలంలోని కొంగాటం పంచాయతీ, చింతల ఎల్లాగరానికి చెందిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి సోదరుడు శ్రీనివాస్‌రెడ్డి(61) ఈ నెల 15వ తేదీ రాత్రి బైక్ పై వెళుతూ రాజపేటరోడ్డు వద్ద ప్రమాదానికి గురయ్యాడు. బెంగళూరులోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యాడు. కుటుంబ సభ్యలు గురువారం బెంగళూరుకు చేరుకుని శ్రీనివాసులు రెడ్డికి చెందిన గుండె, లివర్, కిడ్నీలు, కళ్లు, పాంకియాట్రీస్‌ను ఇతరులకు దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఇతని అంత్యక్రియలు శుక్రవారం మండలంలోని చింతఎల్లాగరంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వారు ఎందుకు గైర్హాజరవుతున్నారు?
చిత్తూరు కలెక్టరేట్: పదో తరగతి విద్యార్థులు దాదాపు వెయ్యి మందికిపైగా క్లాసులకు గైర్హాజరవుతున్నారని, వారు ఎందుకు రావడం లేదో తెలుసుకోవాలని హెచ్‌ఎంలను డీఈఓ రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. ఆయన గురువారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పదోతరగతి విద్యార్థుల సామర్థ్యం ఆధారంగా ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించగా సీ, డీ గ్రూపు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని పదోతరగతి విద్యార్థులు 15,239 మంది ఉండగా 1,477 మంది గైర్హాజరవుతున్నారన్నారు. వీరందరూ ఎందుకు పాఠశాలలకు హాజరు కావడంలేదని సంబంధిత హెచ్‌ఎంలను ప్రశ్నించామన్నారు. వీరిలో ఎక్కువగా తవణంపల్లె, పూతలపట్టు, పలమనేరు ఇతర మండలాల వారు ఉన్నారన్నారు. గైర్హాజరవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి విషయం తెలుసుకోవాలని ఆదేశించారు.
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
పెనుమూరు(కార్వేటినగరం): పదో తరగతిలో వంద శాతం పలితాలు సాధించేలా విద్యాబోధన కొనగాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ సూచించారు. గురువారం పెనుమూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల, గుడ్యానంపల్లి ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ 2025–26 విద్యాసంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు అద్యధిక మార్కులతో వంద శాతం ఫలితాలు సాఽధించేలా ఉపాధ్యాయులు బోధించాలన్నారు. అనంతరం విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అదే విదంగా ఎమ్మార్సీకి వెళ్లి రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట ఎంఈఓ, ఇతర ఉపాధ్యాయులు ఉన్నారు.
కొనసాగుతున్న టెట్
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో టెట్ పరీక్షలు 9వ రోజు కొనగాయి. గురువారం ఉదయం 250 మందికి గాను 242 మంది, మధాహ్నం 85 మందికిగాను 68 మంది హాజరైనట్టు డీఈఓ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
నా ప్రాణం పోయినా.. పది మందీ బతకాలి!
నా ప్రాణం పోయినా.. పది మందీ బతకాలి!


