
నియామక పత్రాల జారీ
– 8లో
డీఎస్సీ కొత్త టీచర్లకు నియామకపత్రాలు జారీ చేశారు. వారంతా సోమవారం నుంచి పాఠశాలలకు వెళ్లనున్నారు.
వేరుశనగ పంట ధ్వంసం
తవణంపల్లె: వేరుశనగ పంట చేతికొచ్చే సమయంలో రాత్రుల్లో అడివి పందులు దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. ఒడుపుకొనే సమయంలో కాయలను పూర్తిగా ఆరగిస్తున్నాయి. మండలంలో పలు చోట్ల కోతులు, అడవి పందుల వల్ల పంట దెబ్బతింటోంది. దీనిపై అటవీశాఖ అధికారులు తగు చర్యలు తీసుకొని, నష్టపోయిన పంటకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
15న మామిడి రైతులఆక్రందన సభ
గంగాధర నెల్లూరు: బంగారుపాళ్యం మార్కెట్ యార్డు వద్ద ఈనెల 15న మామిడి రైతుల ఆక్రందన సభ నిర్వహించనున్నట్టు జిల్లా అధ్యక్షుడు జనార్దన్ తెలిపారు. గంగాధరనె ల్లూరు మండల కేంద్రంలో మామిడి రైతులతో ఆక్రందన సభకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. మామిడి రైతులకు దాదాపు రూ.500 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశా రు. మామిడి రైతు సంఘం కార్యదర్శి బెల్లంకొండ శ్రీనివాసులు, ఉపాధ్యక్షురాలు హేమల త, నేతలు త్యాగరాజులరెడ్డి, సందీప్‌రెడ్డి, పురుషోత్తం, నరసింహులు, రాజేంద్ర నాయు డు, మోహన్‌రెడ్డి, చక్రవర్తి పాల్గొన్నారు.

నియామక పత్రాల జారీ