ప్రోత్సాహక నిధి చెల్లింపులోనూ జాప్యం రోడ్డెక్కుతున్న మామిడి రైతులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కూటమి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ఽమాయవుతోంది. తోతాపురి కేజీకి రూ.4 నుంచి రూ.6 వరకు మాత్రమే చెల్లిస్తోంది. దీనిపై రైతులు రగిలిపోతున్నారు. ఫ్యాక్టరీలు కేజీ తోతాపురికి రూ.8 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహక నిధి రూ.4 చెల్లింపుపై ఆగ్రహానికి గురవుతున్నారు.
కాయలు కొనుగోలు ఇలా...
జిల్లాలోని 43 ఫ్యాక్టరీలో 31 ఫ్యాక్టరీలు మామిడి కొనుగోలుకు ముందుకొచ్చాయి. ఈ ఫ్యాక్టరీలు 49,350 మంది రైతుల నుంచి 2.31 లక్ష మెట్రిక్ టన్నుల దాకా కొనుగోలు చేశాయి. అలాగే ర్యాంపులు 30,600 మంది రైతులు 1.44లక్ష మెట్రిక్ టన్నుల కాయలను ర్యాంపులకు తరలించినట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. అయితే కాయలు ఫ్యాక్టరీలకు తరలించి నెలలు గడుస్తున్నా ఇంత వరకు నగదు చెల్లించలేదు.
కిలోకు రూ.6 వరకు చెల్లింపు
కూటమి ప్రభుత్వం తోతాపురికి మద్దతు ధర ప్రకటించింది. ఫ్యాక్టరీలు కిలోకి రూ.8 చొప్పున కొనుగోలు చేయాల ని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున ప్రోత్సాహక నిధి కింద మరో రూ.4 చొప్పున అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే కొన్ని ఫ్యాక్టరీలు కిలోకి రూ.4 నుంచి రూ.6 వరకు చెల్లిస్తున్నాయి. ఇక ప్రభుత్వ ప్రోత్సాహక నిధి రూ.4 చెల్లింపులోనూ జాప్యం జరుగుతోంది.
ముందే చెప్పిన ఫ్యాక్టరీలు
మామిడి దిగుబడి, ఎగుమతిని దృష్టిలో ఉంచుకుని పళ్లగుజ్జు పరిశ్రమలు ఈసారి మామిడి కొనుగోలుపై ఆసక్తి చూపలేకపోయాయి. అయితే జిల్లా యంత్రాంగం పట్టుబడడంతో చాలా ఫ్యాక్టరీలు కాయలు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాయి. తోతాపురి కేజీ రూ.4, రూ.5, రూ.6కే కొనుగోలు చేస్తామని బోర్డులు సైతం పెట్టాయి. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర చెల్లించలేమని ఫ్యాక్టరీలు తేల్చి చెప్పాయి.
మామిడికి దక్కని మద్దతు ధర
చర్యలు ఉంటాయి
మద్దతు ధర ఇవ్వాలని ఫ్యాక్టరీలకు నోటీసులు ఇచ్చాం. కిలోకి రూ.4 ఎక్కడా ఇవ్వడం లేదు. ఆ బ్యాంకు వివరాలు ఇస్తే కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాం. మద్దతు ధర ఇవ్వకపోతే కరెంటు కట్ చేయిస్తాం. పొల్యూషన్ బోర్డు ద్వారా చర్యలు ఉంటాయి.
– మధుసూదన్‌రెడ్డి,
జిల్లా ఉద్యానశాఖ అధికారి, చిత్తూరు
మద్దతు వి‘ఫలం’!