తన భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని నగరి మండలం, ఏకాంబరకుప్పానికి చెందిన దివ్యాంగురాలు దేవకి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ తనకు 1958 నుంచి సర్వే నం.245/261 లో భూమి ఉందని, కొందరు కబ్జాదారులు ఆ భూమిని ఆక్రమించుకున్నారని వాపోయారు.
భూమిని కబ్జాచేసేందుకు కుట్ర
తనపై దౌర్జన్యం చేసి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చౌడేపల్లి మండలం, రామయ్యగట్టుకు చెందిన సుబ్బులమ్మ వాపోయారు. గ్రామంలో 3 ఎకరాల భూమి ఉందని, కొందరు దౌర్జన్యం చేసి ఆ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. స్థానిక అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గృహహింసకు పాల్పడుతున్నారు
అత్తగారి ఇంట్లో గృహహింసకు పాల్పడుతున్నారని చిత్తూరు నగరం అమ్మ న్ కోయిల్ వీధికి చెందిన బాధితురాలు మీనాకుమారి వాపోయారు. న్యా యం చేయాలంటూ పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశారు. ఆమె మాట్లాడుతూ తన భర్త మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారన్నారు. పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా ఆయన ప్రవర్తనలో మార్పు లేదని ఆవేదన చెందారు.
సర్వేయర్లు పట్టించుకోవడం లేదు
తన భూమిని కొలిచేందుకు పలు మార్లు సర్వేకు దరఖాస్తు చేసుకున్నా సర్వేయర్లు పట్టించుకోవడం లేదని కార్వేటినగరం ఆర్‌కేవీబీపేటకు చెందిన దివ్యాంగుడు మోహన్ వాపోయారు. గ్రామంలో సర్వే నం.154–8 లో ఒక ఎకరా ఐదు సెంట్లు భూమిని ప్రభుత్వం మంజూరు చేసిందని, దానికి హద్దులు నిర్ణయించేందుకు సర్వే చేయించాలని కోరారు.
భూమిని ఆక్రమించేశారు!
భూమిని ఆక్రమించేశారు!
భూమిని ఆక్రమించేశారు!