
న్యాయం జరగడం లేదయ్యా!
‘ఎన్ని సార్లు మొరపెట్టుకుంటున్నా.. తమకు న్యాయం జరగడం లేదయ్యా’ అంటూ అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదికకు పలు ప్రాంతాలకు చెందిన అర్జీదారులు విచ్చేసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై 339 అర్జీలు వచ్చినట్టు జాయింట్ కలెక్టర్ విద్యాధరి తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌వో మోహన్‌కుమార్ పాల్గొన్నారు.
– చిత్తూరు కలెక్టరేట్
అర్జీలు స్వీకరిస్తున్న జాయింట్ కలెక్టర్ విద్యాధరి
సిమెంట్ రోడ్డు
మంజూరు చేయాలి
తమ గ్రామానికి సిమెంట్ రోడ్డు మంజూరు చేయాలంటూ గంగాధరనెల్లూరు మండలం, కుప్పనపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ గ్రామానికి చెందిన యువరాజ్ మాట్లాడుతూ తమ గ్రామానికి గత 30 ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేదన్నారు. ఎస్‌ఎస్ కొండ నుంచి తమ గ్రామానికి సిమెంట్ రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు.

న్యాయం జరగడం లేదయ్యా!